Home » Crime
గోవా కేంద్రంగా నగరంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్(Online Cricket Betting) దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఒక కలెక్షన్ ఏజెంటును అరెస్టు చేశారు. అతని నుంచి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నందిగామ(Nandigama) నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాళ్ల(Muppalla) గురుకుల పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థిని కస్తాల అపర్ణ(12) మృతి చెందడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా వాకర్ హత్య తరహాలో జరిగిన ఈ నేరం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. వయాలికావల్ ప్రాంతంలో ఓ మహిళను హత్య చేసి శరీరాన్ని ఏకంగా 30 ముక్కలుగా ఖంచించి రిఫ్రిజిరేటర్లో దాచిపెట్టారు. ఈ షాకింగ్ ఘటన గురువారం వెలుగుచూసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందులలోనూ భారీ దొంగతనం జరిగింది. హరినాథ్ రెడ్డి అనే హెచ్‌పీ గ్యాస్ డీలర్ పట్టణంలోని విజయ హోమ్స్ ప్లాట్ నంబర్ 149లో నివాసం ఉంటున్నాడు.
గతం వారం గురుగ్రామ్‌లో జరిగిన భయంకర యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆదివారం రాత్రి గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ 23 ఏళ్ల బైకర్ వేగంగా వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో మహీంద్రా ఎస్యూవీ కారు రాంగ్ రూట్లో వస్తోంది.
క్రికెట్(Cricket) ఆడుతున్న యువకుడు హఠాత్తుగా స్పృహతప్పి మృతిచెందిన ఘటన చెంగల్పట్టు జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తరమేరూర్ సమీపం కన్నకొళత్తూర్ ప్రాంతానికి చెందిన బాలాజీ (32) రెండు రోజుల క్రితం మామ ఊరైన నొలంబూర్(Nolambur) వచ్చాడు.
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ బురిడీ కొట్టించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) నకిలీ వెబ్సైట్లు సృష్టించి నగరవాసిని మోసం చేసి రూ.8.94లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుమార్తె పుట్టినరోజు కావడంతో త్వరగా ఇంటికి రావాలన్న తండ్రి ఆతృత కుమారుడిని బలిగొనేలా చేసింది. డీసీఎం వ్యాన్ రివర్స్ తీస్తుండగా దానికింద ఆడుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు చక్రాల కింద నలిగి కన్నుమూశాడు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. పుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చి మరీ దారుణంగా చంపాడు. రెండేళ్ల క్రితమే వారికి పెళ్లి జరిగింది. అప్పట్నుంచి కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడు. తనకు కట్నంగా టీవీఎస్ అపాచీ, రూ.3 లక్షలు కావాలని అడుగుతున్నాడు.
నిర్లక్ష్య డ్రైవింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బైక్‌ను అడ్డదిడ్డంగా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఆ వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడటంతో మృతి చెందాడు.