Home » Crime
భార్యను హత్యను చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పేట్బషీరాబాద్(Petbashirabad) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్ జిల్లా, ఉమ్రి మండలం, గోల్గావా గ్రామానికి చెందిన మాసేవాడ్ వెంకట్(30) అలియాస్ వ్యంకతి మరోటి మాసేవాడ్ బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో వలస వచ్చి కొంపల్లిలోని మసీదు సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ.. కూలి పనులు చేసుకుంటున్నాడు.
ఎటు పోతోంది సమాజం.. మన ఇళ్లల్లోనూ ఆడపిల్లలు ఉంటారన్న సోయి లేకుండా పోతోంది కొందరు మగాళ్లలో. మనమూ ఒక అమ్మకు పుట్టినోళ్లమనే రెస్పెక్ట్ లేకుండా పోతోంది.
న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా.. ముంబై నుంచి ఎండీఎంఏ డ్రగ్స్(MDMA drugs)ను తెచ్చి నగరంలో విక్రయించడానికి ప్రయత్నించిన స్మగ్లర్ను టీజీ న్యాబ్, హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) సంయుక్తంగా అరెస్టు చేశారు.
ఓ మహిళ ఇంటికి వెళ్లిన కొందరు.. తమని తాము మున్సిపల్ ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు. ‘‘మీ ఇంటికి కొలతలు తీయాలి’’.. అని చెప్పడంతో వారి మాటలు నమ్మిన ఆమె.. లోపలికి అనుమతించింది. ఇంట్లోకి వెళ్లిన వారు చివరకు భారీ చోరీకి పాల్పడ్డారు..
తన భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి మరో వ్యక్తిపై దాడిచేసిన ఘటనలో ఓ యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్(KPHB Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కేపీహెచ్బీ ధర్మారెడ్డి కాలనీ(KPHB Dharma Reddy Colony(లోని ఓ హాస్టల్లో కడపకు చెందిన గాలి వరప్రసాద్ అనే వ్యక్తి ఉంటున్నాడు.
కోకాపేట(Kokapet)లో ఓ నిర్మాణ సంస్థ జరిపిన బ్లాస్టింగ్స్ తీవ్ర కలకలం రేపింది. నియోపోలీస్ ప్లాట్ నంబర్-3(Neopolis Plot No. 3) వద్ద సినిమా షూటింగ్ తరహాలో ఏకకాలంలో పదిచోట్ల జరిపిన డిటొనేటర్ల(Detonators) పేలుళ్లతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త. కోకాపే(Kokapet)ట్లో ముత్యాలు, సునీత దంపతులు నివసిస్తున్నారు. ముత్యాలుకు గతంలోనే వివాహం అయినప్పటికీ అతడి సైకో చేష్టలతో మొదటి భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. సునీతను రెండో వివాహం చేసుకున్నాడు.
పెళ్లి బరాత్లో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న వ్యక్తి స్నేహితులతో కలిసి దాడి చేయడంతో కేసుకు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్(Chaitanyapuri Police Station) పరిధిలో శుక్రవారం జరిగింది.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యానగర్(Vidyanagar)కు చెందిన రాజయ్య ప్రైవేటు ఉద్యోగి.
తమిళనాడు(Tamilnadu) రాష్ట్రం కృష్ణగిరి జిల్లా డెంకణీకోట పరిధిలోని బి.శెట్టిపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. కెలమంగలం పోలీసులు(Kelamangalam Police) తెలిపిన వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో వాహనాల విడిభాగాలను తయారు చేస్తారు.