Hyderabad: తల్లిదండ్రులకు చెబుతా అనడంతో...
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:53 PM
భార్యను హత్యను చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పేట్‌బషీరాబాద్(Petbashirabad) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్ జిల్లా, ఉమ్రి మండలం, గోల్‌గావా గ్రామానికి చెందిన మాసేవాడ్ వెంకట్(30) అలియాస్ వ్యంకతి మరోటి మాసేవాడ్ బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో వలస వచ్చి కొంపల్లిలోని మసీదు సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ.. కూలి పనులు చేసుకుంటున్నాడు.
- భార్యను హత్య చేసిన భర్త.. అరెస్ట్
హైదరాబాద్: భార్యను హత్యను చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పేట్‌బషీరాబాద్(Petbashirabad) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్ జిల్లా, ఉమ్రి మండలం, గోల్‌గావా గ్రామానికి చెందిన మాసేవాడ్ వెంకట్(30) అలియాస్ వ్యంకతి మరోటి మాసేవాడ్ బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో వలస వచ్చి కొంపల్లిలోని మసీదు సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ.. కూలి పనులు చేసుకుంటున్నాడు. మాసేవాడ్ వెంకట్, సోని అలియాస్ రేపని పావనితో సుమారు 12 సంవత్సరాల క్రింతం వివాహమైంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గ్రీన్.. జెయింట్.. కోర్.. కోడ్ భాషలతో గంజాయి కొనుగోలు
దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలను నాందేడ్‌లోని మాసేవాడ్ వెంకట్ తల్లిదండ్రుల వద్ద ఉంచారు. వీరి జీవితం కొన్ని రోజులు సజీవంగా సాగింది. తాగుడుకు బానిసైన మాసేవాడ్ వెంకట్ తరచూ భార్యతో గొడవపడుతూ, వేధించేవాడు. బాధలు భరించలేని భార్య తల్లిదండ్రులకు తెలియజేసి, రెండు, మూడుసార్లు పంచాయితీ పెట్టుకొని, పుట్టింటికి వెళ్లింది. దీంతో పెద్దలసమక్షంలో భార్యను ఒప్పించి కొంపల్లికి తీసుకొచ్చాడు. ఈనెల 20న ఉదయం 6 గంటలకు పనికోసం వెంకట్ రోజూ మాదిరిగానే వెళ్లి, 11.30 గంటలకు మద్యం తాగి, ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. భార్య తల్లిదండ్రులకు చెబుతా అన్నది.
దీంతో ఆవేశానికి గురైన వెంకట్ వంట కోసం తెచ్చుకున్న సెంట్రింగ్ కర్రతో భార్య తలపై మోదడంతో అక్కడికక్కడే మరణించింది. దీంతో అతడు పారిపోయాడు. స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిజామాబాద్ టోల్‌ప్లాజా వద్ద బైక్‌పై వెళుతున్న నిందితుడిని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి, రిమాండ్‌కు తరలించారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మానవత్వం లేదా ?
ఈవార్తను కూడా చదవండి: KTR: రేవంత్ తేల్చుకుందాం.. కేటీఆర్ సవాల్
ఈవార్తను కూడా చదవండి: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై ఊహించని పరిణామం
ఈవార్తను కూడా చదవండి: ‘సత్వా ఎలిగ్జిర్’లో భారీ అగ్ని ప్రమాదం
Read Latest Telangana News and National News