Home » Crime
భర్త, అత్తల వేధింపులు తాళలేని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చిత్తాపూర్ గ్రామానికి చెందిన మొక్కపాటి శ్రీనివాసరావు(Mokkapati Srinivasa Rao) పెద్ద కుమార్తె వెంకట నాగలక్ష్మి (28) మియాపూర్ మాతృశ్రీనగర్‌లో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ ఉల్లాసంగా అలిపిరి మెట్లెక్కుతున్న ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండె పట్టుకుని పడిపోయిన మిత్రుడికి ఏమైందో తెలియక పైకి లేపేందుకు ప్రయత్నించారు తోటి స్నేహితులు. పక్కన భక్తులు, సమీపంలోని సిబ్బందితో కలిసి వెంటనే తిరుమలలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు.
తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన దొంగలను అంబర్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఒడిస్సా నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర(Maharashtra)కు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) పట్టుకున్నారు. 10.070 కిలోల గంజాయి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దోసెలు వేసి తీసుకొచ్చేలోపే ఈ ఘటన జరగడంతో భార్య నిశ్చేష్ఠురాలైంది. వెంటనే 108కు ఫోన్ చేయగా వారు వచ్చి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.
ధూల్‌పేట్(Dhoolpet)లో గంజాయి డాన్‌గా పేరొందిన అంగూరి బాయ్ అలియాస్ అరుణాబాయ్ను ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 15 కేసుల్లో జైలుకెళ్లొచ్చిన అంగూరి భాయ్ మరో 10 కేసుల్లో తప్పించుకు తిరుగుతోంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
మారణాయుధాలతో నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతడిని బెదిరించి 2 కిలోల బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్(Domala guda Police Station) పరిధిలోని అరవింద కాలనీలో జరిగింది.
‘‘వివరాలు ఇవ్వండి.. లోన్ తీసుకోండి’’ అంటూ సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ. 1,12,535 కాజేశారు. ఎల్బీనగర్ ఎస్‌హెచ్‌వో వినోద్‌కుమార్(LB Nagar SHO Vinod Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తునికి చెందిన మువ్వల మల్లేశ్వరరావు ఎల్బీనగర్ ఎస్బీహెచ్ కాలనీ వెంచర్-2లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
మూసీ అభివృద్ధి పనుల్లో తన ఇల్లు ఎప్పుడైనా కూలిపోవచ్చన్న మనోవ్యధ ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసింది. పైసాపైసా కూడబెట్టి చేసి కట్టుకున్న ఇల్లు ఎప్పుడు పోతుందో తెలియడం లేదంటూ ఇంట్లో నుంచి వెళ్లిన అతడు ఆటో నడుపుతూనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
చింతల్(Chintal)లో దారుణం జరిగింది. గుర్తుతెలియని మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. హత్యకు గురైన మహిళ(40) గతంలో గాజుల రామారం(Gajula Ramaram) ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుండేది.