Home » Andhra Pradesh » Prakasam
పోలీసు శాఖ ప్రక్షాళనకు ఎస్పీ ఏఆర్.దామోదర్ శ్రీకారం పలికారు. కార్యస్థానాలలో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిపై చర్యలు తీసుకున్నారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీ చేపట్టిన విచారణ ఇంకా కొనసాగుతోంది. రెండు, మూడు రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా త్రిసభ్య కమిటీని ఆదేశించారు.
సంక్షేమ రాజ్యం మళ్లీ మొదలైంది. గత ఐదేళ్లుగా వైసీపీ పాలకులు మూలన పడేసిన పథకాలకు తిరిగి జీవం రానుంది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్దపీట వేసింది. గత ప్రభుత్వం నిలిపివేసిన పథకాలను తిరిగి ఆయా వర్గాలకు అందించే దిశగా నిధులు కేటాయింపులు చేసింది. వీటిని తక్షణమే అ మల్లోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీంతో ఆయా వర్గాలకు ఊరట లభించినట్లైంది. కొత్త పథకాలతో పాటు కొర్పొరేషన్ రుణాలతో ఎక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉంది.
యువతను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్య క్షుడు లక్కరాజు రామారావు విమర్శించారు.
బాలల హక్కుల పరిరక్షణకు సంబంధి త చట్టాలపై అధికారులందరికీ సమగ్ర అవగా హన అవసరమని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
కంభం ప్రభుత్వ వైద్యశాలకు వివిధ సమస్యలపై వచ్చే రోగుల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ, కనీస వసతులు మాత్రం అందుబాటులో ఉండడం లేదు.
ఎర్రగొండపాలెం మండల ప్రజలు బయటకు రావాలంటే భయబ్రాం తులకు గురవుతున్నారు. వివిధ పనుల నిమి త్తం బయటకు రావాలన్నా, పోవాలన్నా కుక్క లు, కోతులు దాడి చేస్తాయని బెదిరి పోతు న్నారు.
జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్ 14, అండర్ 17 విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ కె.నర్సింహారావు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 13న చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపిక పోటీలు జరిగాయి.
మండలంలోని మోటుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అడవీధిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన దేవండ్ల యామిని రాష్ట్ర కబడ్డీ బాలికల అండర్-14 జట్టుకు ఎంపికైంది. ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవారిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీ జట్టు తరపున పాల్గొన్నట్లు పాఠశాల హెచ్ఎం ఏ.మాధవీలత గురువారం తెలిపారు.
మండలంలోని లక్కవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈనాం భూములను గురువారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మండల రెవెన్యూ, సర్వే అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. ఈ రెవెన్యూ పరిధిలో 569 ఎకరాలు ఈనాం భూములు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పొలాలను రైతులు సాగుచేసుకుంటున్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు గాని ఇతరత్రా ఎలాంటి భూమి హక్కుపత్రాలు లేవు.