Home » Elections
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ‘గాడిద గుడ్డు’ బాగా పాపులర్ అయుంది. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ‘గుడ్డు’ చుట్టూ రాజకీయం జరుగుతోంది.
తెలంగాణ ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో ఒక రకంగా, పార్లమెంటు ఎన్నికల విషయంలో మరోలా స్పందిస్తున్నారా? ఎమ్మెల్యేలుగా ఒక పార్టీ అభ్యర్థులను గెలిపిస్తూ.. ఎంపీలుగా మరో పార్టీవైపు మొగ్గుతున్నారా? అంటే.. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఇది నిజమేననిసిస్తోంది.
తమ సిటింగ్ స్థానమని అధికార కాంగ్రెస్, ఎమ్మెల్యేలంతా తమ వాళ్లేనని బీఆర్ఎస్, ప్రధాని మోదీ ఇమేజ్ కలిసివస్తుందని బీజేపీ.. ఇలా ఎవరికి వారు మల్కాజిగిరిలో గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను.. వాటితోపాటు మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్, బీజేపీకి మెదక్ ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హిందువైతే భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) సవాల్ విసిరారు. 27 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ అవునా..? కాదా...? ప్రమాణం చేయాలి అని సవాల్ విసిరారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ అవునా కాదా..? ప్రమాణం చేయాలన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీఈఓ వికాస్ రాజ్‌ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత (Madhavi latha) కలిసి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ (Congress) పార్టీని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) అన్నారు. నర్సంపేటలో సోమవారం బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై పుష్కర్ సింగ్ దామి తీవ్ర విమర్శలు గుప్పించారు. మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం - బీజేపీ - జనసేన ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కూడా బీజేపీ (BJP) పార్టీకి తెలుగుదేశం (Telugu Desam Party) మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీటీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర కీలక నేతలు ప్రకటించారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500 మంది పోలీసులు, సీఏపీఎఫ్ నుంచి 13, సీఆర్పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో ఉంటారని సీపీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలను వాడుతామన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఇచ్చిన కంటే తక్కువ సెంట్రల్ బలగాలు ఈసారి హైదరాబాద్‌కి వచ్చాయన్నారు. మరిన్ని బలగాలను పంపాలని కోరామన్నారు.