Home » National
తన సినీ ప్రయాణంలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ‘వారారు వారారు అళగర్ వారారు’ అనే పాట తనకు మంచి గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందని దానికి కెప్టెన్ విజయకాంత్(Captain Vijayakanth)కు రుణపడివున్నానని ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు దేవా(Senior music director Deva) అన్నారు.
సాత్తనూర్ డ్యాం, మొసళ్ల ఫాం నుంచి 150కి పైగా మొసళ్లు(Crocodiles) తప్పించుకున్నాయని దిగ్ర్భాంతికర వార్తలు వస్తున్నాయి. తిరువణ్ణామలై జిల్లా సాత్తనూరు డ్యాం సమీపంలో, ఆసియాలోనే రెండవ అతిపెద్ద మొసలి ఫాం ఉంది.
రాష్ట్రంలో జల్లికట్టు పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో జనవరి 14వ తేది పొంగల్ వేడుకల్లో భాగంగా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారు. మదురై అవనియాపురం, పాలమేడు, అలంగానల్లూర్(Madurai Avaniyyapuram, Palamedu, Alanganallur) తదితర ప్రాంతాల్లో జరిగే జల్లికట్టు పోటీలు చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు.
రాష్ట్రంలో ద్రావిడ తరహా పరిపాలనను అపహాస్యం చేస్తున్నవారికి ఇక ద్రవిడ ఉద్యమనేత పెరియార్ ఊతకర్రే తగిన విధంగా సమాధానం చెబుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) వ్యాఖ్యానించారు.
బంగాళాఖాతంలో ఆంధ్రా కోస్తాతీరం దిశగా వెళ్ళి, తీరం దాటకుండా రాష్ట్రం వైపు మళ్ళిన అల్పపీడనం ప్రస్తుతం డెల్టాజిల్లాల వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి బంగాళాఖాతంలో ప్రవేశించి రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల దిశగా కదిలింది.
అంబేడ్కర్ను కేంద్ర హోం మంత్రి అమిత్షా రాజ్యసభలో అవమానించారంటూ పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఎన్నికల నిబంధనల్లో మార్పులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్రం సవరించడంపై సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేసింది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలు బుధవారం భేటీ కానున్నాయి. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ కీలక సమావేశం జరగనుంది. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ శత జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్డీయే నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించనున్నారు.
అణు విద్యుత్ కేంద్రం నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(77), కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.
కరుడుగట్టిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ సునీల్ యాదవ్ అమెరికాలో హత్యకు గురయ్యాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కి అనుచరుడిగా ఉన్న రోహిత్ గొదారా అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రతీకారంతోనే ఈ హత్య చేసినట్టు తెలిపాడు.