Share News

నేడు ఎన్డీయే నేతల కీలక భేటీ

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:40 AM

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలు బుధవారం భేటీ కానున్నాయి. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ కీలక సమావేశం జరగనుంది. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్డీయే నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించనున్నారు.

నేడు ఎన్డీయే నేతల కీలక భేటీ

న్యూఢిల్లీ, డిసెంబరు 24: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలు బుధవారం భేటీ కానున్నాయి. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ కీలక సమావేశం జరగనుంది. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్డీయే నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు నడ్డా నివాసంలో నేతలు భేటీ కానున్నట్లు సమాచారం. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు సహా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొననున్నారు. అంబేడ్కర్‌పై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలతో తీవ్ర రాజకీయ దుమారం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో కాంగ్రె్‌సకు గట్టిగా సమాధానం చెప్పే విషయంపైనా నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - Dec 25 , 2024 | 04:41 AM