Home » 2024 Lok Sabha Elections
దేశంలో పెనుమార్పు సంభవిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు అండగా ఉన్నారన్నారు. అయిదో దశలో భాగంగా సోమవారం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు......
దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని పార్టీల కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాది భారీ విజయాలతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిపి 400 సీట్లు దాటుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘మరోసారి మోదీ సర్కారు...
పోలింగ్ బూత్‌లోకి మొబైల్ తీసుకునేందుకు అనుమతి ఉండదు. గది బయట ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అలాంటిది ఓ యువకుడు మొబైల్ తీసుకోవడమే కాదు ఏకంగా వీడియో కూడా తీశాడు. మాములుగా అయితే ఒకసారి ఓటు వేయాలి. అతను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు ఓటు వేశాడు.
దేశవ్యాప్తంగా ఐదో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే భరతమాత వేలాది మంది కేజ్రీవాల్‌లకు జన్మనిస్తుందని ప్రధాని మోదీని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. అరెస్టుల ద్వారా ఆప్‌ను నాశనం చేయలేరని, ఆప్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక ఆలోచనాధార అని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయకూడదంటూ విద్యార్థులకు చెప్పిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడ్ని అరెస్టు చేసినట్టు బిహార్ రాష్ట్ర అధికారులు తెలిపారు. ముజఫర్‌నగర్ జిల్లా కుర్హానీ సమితి అమ్రఖ్‌లోని ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న హరేంద్ర రజక్‌పై ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ వాడుతున్న మావోయిస్టు భాష కారణంగా.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామిక వేత్త అయినా ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తాడని ప్రధాని మోదీ విమర్శించారు.
బాలీవుడ్ సెన్సేషన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా అడుగిడి, దర్శకురాలిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. భారతీయ జనతా పార్టీలో చేరి, మండీ లోక్ సభ నుంచి బరిలోకి దిగారు. విపక్ష పార్టీలు, నేతలపై ఒంటికాలిపై లేస్తున్నారు.
తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం షరతులు విధించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన ఏడో విడత లోక్ సభ ఎన్నిక ముగియనుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండీషన్ పెట్టింది.
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ రోజు ఆప్ బీజేపీ కేంద్ర కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చింది. సీఎం కేజ్రీవాల్, ఆప్ ముఖ్యనేతలు బీజేపీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఆప్ నేతల బీజేపీ ఆఫీసు ముట్టడి నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మొహరించారు.