Home » 2024
పాఠశాల విద్యార్థులకు నిర్వహించే పరీక్షల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. 2023-24 విద్యా సంవత్సరం ఎఫ్ఏ-3, 2024-25 విద్యా సంవత్సరం ఎఫ్ఏ, ఎస్ఏ ప్రశ్న పత్రాలు, పనుల టెండర్లలో గోల్మాల్ చేశారు. వర్కుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులో అడ్డగోలుగా వ్యవహరించారు. వీటిపై రెండు విచారణలు జరిగాయి. ఎఫ్ఏ-3కి సంబంధించి రూ.31.80 లక్షల వర్క్ ఆర్డర్ ఉత్తర్వులపై డీఈఓ వరలక్ష్మి సంతకాలు లేవు. ఆమె ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించగా.. డిసెంబరులోనే ఆమె...
వైద్యం కోసం వచ్చిన రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. పదుల సంఖ్యలో బాధితులు క్యూలో నిలబడ్డారు. ఓపీ చీటీలు రాసేచోట, వైద్య పరీక్షలు నిర్వహించేచోట, చివరకు వైద్యుల వద్ద కూడా రద్దీ ఉంది. వారికి సకాలంలో సేవలు అందించాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. సెల్‌ఫోనలో మాట్లాడుతూ బిజీగా కనిపించారు. గుత్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆంధ్రజ్యోతి సోమవారం విజిట్ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ...
మండలంలోని యలక్కుంట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భయం భయంగా చదువులు సాగి స్తున్నారు. పాఠశాలలో 1-5 తరగతులుకు గాను 24 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి మూడు పాఠశాల భవనాలుండగా, అందులో రెండు భవనాలు శిథిలం అయ్యాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ఆర్భాటంగా కాలనీలు కాదు... ఊ ర్లు నిర్మిస్తున్నామంటూ గొప్పలు చెప్పి జగనన్న కాలనీ లు ఏర్పాటు చేశారు. అయితే ఆ కాలనీల్లో పూర్తి స్థా యిలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఆయా కాలనీల్లో మౌలిక కల్పించకపోవడంతో నివాసముంటున్న లబ్ధి దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో గార్లదిన్నె, కల్లూరు, ఇల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో జగనన్న కాలనీలు ఏ ర్పాటు చేశారు.
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో మం డలంలో తోపుదుర్తి సోదరుల అండతో విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజారెవెన్యూ దర్బార్- భూ సమస్య పరిష్కార వేదిక నిర్వహించారు. ధర్మవరం ఆర్డీఓ మహేశ, రెవెన్యూ అధికా రులతో కలిసి ఎమ్మెల్యే రైతుల నుంచి అర్జీల ను స్వీకరించారు.
ఇకపై నగరంలో గుంతల రోడ్లు, చెత్తా, చెదారం కనిపించకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశించారు. ఆయన శుక్రవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో నగరపాలిక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అం శాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు.
వరద బాధితులకు ఎమ్మెల్యే పరిటాల సునీత అండగా ఉంటారని టీడీపీ మండల ఇనచార్జ్ ధర్మవరపు మురళి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన మండలంలోని కళాకారుల కాలనీ, దండోరా కాలనీలోని ప్రజలకు గురువారం ఆయన బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
నేను అవినీ తికి పాల్పడను... ఎవ్వ రికి భయపడను ... ’అంటూ కోపంతో సర్వ సభ్య సమావేశం నుంచి తహసీ ల్దారు అరుణకుమారి వెళ్లి పోయారు. స్థానిక మండలపరిషత కార్యాల యంలో గురువారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశం వాడివేడిగా జరిగింది.
నగర శివారులో వరద బీభత్సానికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వంకలు, వాగుల నిర్వాహణను ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ఉప్పరపల్లిలోని కాలనీల ముంపునకు ఇదే కారణమని బాధితులు అంటున్నారు. ఐదేళ్లలో పండమేరు వంకలో ఒక్కసారి కూడా జంగిల్ క్లియరెన్స చేపట్టలేదు.
కలెక్టర్ వినోద్ కుమార్ ముందుచూపు వలనే వరద నష్టం బాగా తగ్గిందని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు బుధవా రం రాత్రి అనంతపురం రూరల్ పంచాయతీ గ్రామ సచివాలయం-2లో నిత్యవసరాల పంపిణీ చేపట్టారు. కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరై ఐదు రకాల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.