Home » Accident
ప్రతికూల వాతావరణం నేపాల్(nepal) ప్రజలకు సమస్యగా మారింది. ఈ క్రమంలోనే నేడు ఉదయం మధ్య నేపాల్‌లోని మదన్ ఆషిర్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో(Landslide Sweeps) అదే ప్రాంతంలో ప్రయాణిస్తున్న రెండు బస్సులు(buses) బోల్తా కొట్టి త్రిశూలి నది(Trishuli River)లో పడిపోయాయి.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని హత్రాస్(Hathras district)లో ఇటివల జరిగిన తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో ప్రమాదం(accident) చోటుచేసుకుంది. గురువారం (జులై 11న) ఉదయం వేగంగా వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు, ట్రక్కు బలంగా ఢీకొన్నాయి.
ఇటివల అనేక చోట్ల పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలోనే స్కూల్ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న వ్యాన్లు, బస్సుల విషయంలో మాత్రం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వాహనాలు అనేక చోట్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ మినీ బస్సును పికప్ ట్రక్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది(accident). దీంతో అందులో ఉన్న స్కూల్ విద్యార్థుల్లో 12 మంది, డ్రైవర్ కూడా మృత్యువాత చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
చాలా మంది చిన్న చిన్న సమస్యలకే తీవ్రంగా కుంగిపోతుంటారు. మరికొందరు సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయకుండా ఆత్మహత్యే పరిష్కారం అన్న ఆలోచనలో ఉంటారు. ఈ క్రమంలో...
బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఉన్నావ్(Unnao)లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం(accident) చోటుచేసుకుంది. బీహార్‌లోని మోతిహారి నుంచి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృత్యువాత చెందగా, మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఆకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదం హర్యానా(Haryana)లోని పంచకుల(Panchkula)లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
భార్యాభర్తలను విధి వేరు చేసింది. నెలక్రితం ప్రమాదవశాత్తు రొటావేటర్ కిందపడి భర్త మృతి చెందగా, అప్పటికే గర్భిణిగా ఉన్న భార్య వారం క్రితం ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది.
ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆరా తీశారు. జగ్గయ్యపేట మండలం బూదవాడ(Budawada) గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం(Ultratech cement factory)లో బాయిలర్ పేలి 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తక్షణం బాధితులకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ప్రయాణికుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటే.. మరికొన్నిసార్లు వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..