Share News

Viral Video: ఏ కష్టమొచ్చిందో ఏమో గానీ.. తండ్రీకొడుకులు కలిసి రైల్వే స్టేషన్‌లో చేతులు పట్టుకుని మరీ ఇలా..

ABN , Publish Date - Jul 10 , 2024 | 04:52 PM

చాలా మంది చిన్న చిన్న సమస్యలకే తీవ్రంగా కుంగిపోతుంటారు. మరికొందరు సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయకుండా ఆత్మహత్యే పరిష్కారం అన్న ఆలోచనలో ఉంటారు. ఈ క్రమంలో...

Viral Video: ఏ కష్టమొచ్చిందో ఏమో గానీ.. తండ్రీకొడుకులు కలిసి రైల్వే స్టేషన్‌లో చేతులు పట్టుకుని మరీ ఇలా..

చాలా మంది చిన్న చిన్న సమస్యలకే తీవ్రంగా కుంగిపోతుంటారు. మరికొందరు సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయకుండా ఆత్మహత్యే పరిష్కారం అన్న ఆలోచనలో ఉంటారు. ఈ క్రమంలో అలాంటి వారంతా చివరకు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తుంటారు. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఏ కష్టమొచ్చిందో ఏమో గానీ.. తండ్రీకొడుకులు కలిసి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌లో పట్టాలపై చేయి పట్టుకుని నడుచుంటూ వెళ్తూ ఉన్నట్టుండి ఏం చేశారో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని (Mumbai) పాల్ఘర్ జిల్లాలోని భయందర్ రైల్వే స్టేషన్ (Railway station) సమీపంలో జూలై 9న ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక వాసాయి ప్రాంతానికి చెందిన హరీష్ మెహతా (60).. తన కొడుకు జై మెహతా (30) తో కలిసి భయందర్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. వారి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చి పడ్డాయో తెలీదు గానీ.. చివరకు ఇద్దరూ కలిసి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

Viral Video: సర్జరీ చేస్తుంటే.. ఏమాత్రం భయం లేకుండా.. చివరకు వైద్యులకే షాక్ ఇచ్చాడుగా..


ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఇద్దరూ (father and son) నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్లాట్‌ఫామ్‌ చివరి వరకూ వెళ్లిన తర్వాత రైల్వే ట్రాక్స్ పైకి వెళ్లారు. ఇద్దరూ చేయి చేయి కలిపి మాట్లాడుకుంటూ వెళ్లారు. అదే సమయంలో విరార్ నుంచి చర్చిగేట్ వెళ్తున్న లోకల్ ట్రైన్ అటుగా వచ్చింది. రైలు దగ్గరికి రాగానే ఇద్దరూ ఒకేసారి దానికి ఎదురుగా వెల్లి పట్టాలపై పడుకున్నారు. ఈ ఘటనలో (suicide) వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Viral Video: తెలివితక్కువ పులిని ఎప్పుడైనా చూశారా.. నీటిలో పాము అనుకుని చివరకు అది చేసిన నిర్వాకం..


తండ్రీకొడుకుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు నమొదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. ఎంత ఘోరం’’... అంటూ కొందరు, ‘‘ఎంత కష్టమొచ్చిందో ఏమో పాపం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: డ్యూటీ టైంలో నర్సులంతా కలిసి గదిలో చేసిన వింత నిర్వాకం.. చివరకు కొందరు వీడియో తీయడంతో..

Updated Date - Jul 10 , 2024 | 04:52 PM