Home » Ambati Rambabu
‘పల్నాడు జిల్లా సత్తెనపల్లి మెయిన్ రోడ్డు పక్కన జిల్లా పరిషత్కు రూ.30 కోట్లు విలువ చేసే 2.74 ఎకరాల భూమి ఉంది. దానిని కాజేసేందుకు అప్పటి మంత్రి అంబటి రాంబాబు చాలా ప్రయత్నం చేశాడు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కొత్త రాగం అందుకున్నారు. పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకోలేదని...
తనకు అర్థం కాలేదు కాబట్టి.. పోలవరం సబ్జెక్ట్ ఇంకెవరికీ అర్థం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని తొలిసారిగా చెప్పిన గొప్పతనం కూడా తనదేనని గొప్పగా చెప్పుకొన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటికి చీర.. జాకెట్, పూలు ఇచ్చేందుకు తెలుగు విద్యార్థి నేతలు వెళ్లారు. సుకన్య, సంజనాలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వనం అందించేందుకు వెళ్లిన విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు అయ్యింది. తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలనే పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీ పోలింగ్ జరపడం ఏంటి అని ప్రశ్నించింది. మంత్రి అంబటి రాంబబు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది.
పల్నాడు జిల్లాల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ జరిగిన రోజు, ఆ తర్వాత అల్లర్లు, అరాచకాలు జరుగుతున్నాయి. అయితే ఈ అల్లర్లలో పెద్దఎత్తున రిగ్గింగ్కు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.
Andhrapradesh: పల్నాడులో హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార వైసీపీలోని అగ్గి వీరులు.. అదే నండి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వగైరా వగైరా ఎక్కడ అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది.
ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు మొత్తం రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిషితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది చేసే నష్టాన్ని ఊహించలేం.. ఇలాంటి అనుభవాలు ఎన్నో స్వాతంత్య్ర భారతంలో చూశాం. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిన్నటి వరకు మనవాళ్లుగా ఉన్నవాళ్లే.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. నువ్వు సూపర్ అంటూ ప్రశంసినవాళ్లే.. వాడో వేస్ట్ అంటూ విమర్శించవచ్చు.. ఎన్నికల వేళ ఇవ్వన్నీ సాధారణ విషయాలు అయిపోయాయి.
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది అధికార వైసీపీ(YCP) నేతలు రోజుకొకరుగా చిక్కుల్లో పడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు.. సొంత ఇంట్లోంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పిఠాపురంలో(Pithapuram) కాపు నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సొంత కూతురే ఆయనపై తీవ్ర విమర్శలు చేయగా.. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) వంతు వచ్చింది.