Minister Satya kumar: పోలవరం నిర్వీర్యం చేశారు.. అంబటి రాంబాబుపై మంత్రి సత్య కుమార్ ఫైర్
ABN , Publish Date - Mar 31 , 2025 | 08:52 PM
Minister Satya kumar: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఏపీలోని పలు ప్రాజెక్ట్‌లకు నష్టం వాటిల్లిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

గుంటూరు జిల్లా: పోలవరం గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఏమాత్రం అవగాహన లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. పీ4 వలన పేదలకు లబ్ధి కలుగుతుందని అన్నారు. ప్రజా సమస్యలను ఐదేళ్లలో వైసీపీ నాయకులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరానికి 90 శాతం, రాష్ట్రం ప్రభుత్వం 10 శాతం నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం పోలవరం పనులు పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వంలో ఎంత శాతం పని చేశారని ప్రశ్నించారు. అప్పటి మంత్రి అంబటి రాంబాబు పోలవరంపై ఒక్క సమీక్ష నిర్వహించలేదని ధ్వజమెత్తారు. పోలవరం నిర్వీర్యం చేసినందుకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గత జల వనరుల శాఖ మంత్రి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులను అంబటి రాంబాబు వదిలేశారని మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోరంట్ల మాధవ్ శవ, కుల రాజకీయాలు చేస్తున్నారు: పరిటాల సునీత
అనంతపురం: రాప్తాడులో పరిటాల కుటుంబం పేరు ఎత్తకుండా వైసీపీ నాయకులు రాజకీయాలు చేయలేక పోతున్నారని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. పాపిరెడ్డి పల్లిలో కురుబ లింగమయ్య హత్య బాధాకరమని అన్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్‌కు కనీస విజ్ఞత లేదని ఫైర్ అయ్యారు . పాపిరెడ్డిపల్లిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో... ఆవేశంలో లింగమయ్యపై దాడి జరిగిందని అన్నారు. లింగమయ్య హత్య రాజకీయాలు, పార్టీలు, కులాలకు సంబంధం లేదని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో హత్య జరిగితే దాన్నితమపై నెడుతున్నారని మండిపడ్డారు. రాప్తాడులో సీటు కోసం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గొడవలు పడుతూ ప్రతిదీ తమకు ఆపాదిస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ శవ, కుల రాజకీయాలు చేస్తున్నారని పరిటాల సునీత విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు
Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ
Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్
Read Latest AP News And Telugu News