Home » Anagani Satya Prasad
బాపట్ల జిల్లా: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం మంత్రి రేపల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి కుంటుపడిందన్నారు.
అమరావతి: సీఎం జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లే పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించిందని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ సంక్షేమ పథకాలు ఆపమని చెప్పిందా? అని ప్రశ్నించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డికి కులపిచ్చి పరాకాష్టకు చేరిందని, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని, కాపు, బలిజలను జగన్ రెడ్డి రాజకీయంగా అణిచివేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు.
అమరావతి: అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీక్షా విరమణ సమయంలోనూ ప్రత్యేక బస్సులు కేటాయించకపోవడంతో శబరిమల వెళ్లే స్వాములు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.
అమరావతి: మత్య్సకారులకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 8 ఫిషింగ్ హార్బర్లు, 4 జెట్టీలు కడతామన్నారని, కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఎందుకు నిర్మించలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
అమరావతి: ఎన్నికల్లో జగన్ రెడ్డి టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తిరిగి వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
రేపల్లె మాజీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Satya Prasad) గన్నవరం ఎయిర్ పోర్టులో(Gannavaram Airport) పోలీసులు అడ్డుకున్నారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ళ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం గత 40 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే అమర్నాథ్ హత్యకు గురయ్యాడని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (MLA Anagani Satya Prasad) ఆరోపించారు.
వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ కుటుంబసభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు. శనివారం ఉదయం రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్.. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం చేరుకుని విద్యార్థి కుటుంబసభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపల్లె చరిత్ర ఎన్నడూ లేని సంఘనలు జరుగుతున్నాయన్నారు. అక్కను వేధించడంపై ప్రశ్నించిన తమ్ముడును పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. పోలీసులు నిందుతులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.