Share News

Minister Sathya Prasad: ప్రతిపక్ష హోదా కోసం జగన్ వితండవాదం.. మంత్రి అనగాని సెటైర్లు

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:58 PM

Minister Anagani Sathya Prasad: ప్రతిపక్ష హోదా కావాలంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వితండవాదం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ప్రజలివ్వని హోదాను జగన్ కోరుకోవడం ఆయన నియంత ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

 Minister Sathya Prasad: ప్రతిపక్ష హోదా కోసం జగన్ వితండవాదం.. మంత్రి అనగాని సెటైర్లు
Minister Anagani Sathya Prasad

అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం డ్రామాలు ఆడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్‌కు కావాల్సింది ప్రతిపక్ష హోదానే కాని ప్రజా సమస్యలు మాత్రం ఆయనకు పట్టవని విమర్శించారు. శాసనసభ సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే ఈరోజు జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారని చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా లేకున్నా ఏపీ అసెంబ్లీలో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలెందరో ప్రజా సమస్యలను సమర్థవంతంగా లేవనెత్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్ గుర్తుచేశారు.


ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. లోక్‌సభలో వాజ్‌పేయికి ప్రతిపక్ష నేత హోదా లేకున్నా దేశ సమస్యలను అర్ధవంతంగా సభ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. 2004లో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు హాజరై ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటారని చెప్పారు. జగన్ రెడ్డి మాత్రం ప్రజా సమస్యలను ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదా కావాలంటూ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలివ్వని హోదాను జగన్ కోరుకోవడం ఆయన నియంత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. జగన్ రెడ్డికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉన్నా, చట్ట నిబంధనలపై గౌరవం ఉన్నా శాసనసభా సమావేశాలకు హాజరయ్యేవారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: 11 మందితో వచ్చింది 11 నిమిషాల కోసమా.. జగన్‌పై షర్మిల ఆగ్రహం

Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 24 , 2025 | 05:03 PM