Home » Anantapur urban
సొంత జిల్లాకు రావడానికి ఎంపీఈఓలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ పాలనలో తమను ఓడీపై చిత్తూరుకు పంపి అన్యాయం చేశారని, మీరే న్యాయం చేయాలని ఇదివరకే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలిసి విన్నవించారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మధ్యంతరభృతి ప్రకటించాలని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయభవనలో ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన (ఆప్టా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు.
రాయలసీమ నుంచి గొప్ప ఆధునిక సాహిత్యం వస్తోందని, ఇక్కడి సాహిత్యం ఎంతో స్ఫూర్తిదాయకమని నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి పేర్కొన్నారు.
ప్రభుత్వ ఖజానాకు గండికొట్టా లని చూస్తే సహించేది లేదని విజిలెన్స ఎస్పీ వైటీపీటీఏ ప్రసాద్ హెచ్చ రించారు. ఆయన శుక్రవారం విజిలెన్స కార్యాలయంలోని తమ చాంబర్లో కార్యాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.
కార్మికులకు అన్యాయం చేస్తున్న అవినీతి ఎంహెచఓ విష్ణుమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో బదిలీ చేసి పంపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై శుక్రవారం మున్సిపల్ యూనియన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటీఎం నాగరాజు, నాగభూషణం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఆందోళన చేపట్టారు.
లోకకల్యాణం కోసం శా రదానగర్లోని శివబాల యోగి ఆశ్రమంలో గురు వారం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులతో ఆలయ ప్రాకా రోత్సవం నిర్వహించారు. అనంతరం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు.
జిల్లా కేంద్రమైన నగరంలో రహదారుల విషయంలో ఇంకా మార్పు రాలేదు. చాలా చోట్ల ఇంకా గుంతల రోడ్లు దర్శనమిస్తున్నాయి. గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో గుంతలు లేని రోడ్లు చేస్తామని గొప్పలు చెప్పినా అమలుకు నోచుకోలేదు. దాదాపు ఏడాది కాలంగా బిల్లులు కాకపోవడంతో, కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
వైద్యఆరోగ్యశాఖలో ఓ చిరుద్యోగి ఆర్ఎంపీ డాక్టర్‌గా అవతారమెత్తి క్లినిక్ నడపడంపై వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఈబీ దేవి ఈబీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తనిఖీ చేసి క్లినిక్‌ను సీజ్ చేయించారు.
మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఇన్నోవేషన మిస్సైల్‌లాంటివారని జేఎనటీయూ వీసీ ప్రొఫెసర్ సుదర్శన రావు అన్నారు. మంగళవారం జేఎనటీయూలో అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.
పల్లె పండుగ అంటే ఇదే అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నెల రోజుల్లో నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీల్లో రూ.3కోట్లతో అభివృద్ధి పనులు చపడతామన్నారు.