Home » Anantapur urban
ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని సీపీఎం ఒకటవ నగర కమిటీ కార్యదర్శి రామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురం అర్బన తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో కార్డుదారులతో కలసి చేపట్టిన ధర్నాకు ఆయన హాజరై మాట్లాడారు.
వైసీపీ పాలనలో అభివృద్ధిని అటకెక్కించిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. గురువారం మండలంలోని ఎ.నారాయాణపురం పంచాయతీ తపోవనంలో సీసీరోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే హాజరై స్థానిక నాయకులు, అధికారులతో కలసి భూమి పూజ చేశారు.
తమను రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ స్టాఫ్నర్సులు చేపడుతున్న ఉద్యమం ఊపందుకుంది. రెండురోజులుగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు బహిష్కరించి నిరసనలు కొనసాగిస్తున్నారు.
విజయవాడ, గుంటూరు జిల్లాల్లో సంభవించిన వరద విపత్తు సమయంలో జగన సీఎంగా ఉండి ఉంటే జల సమాధులు చూడాల్సి వచ్చేదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.
అపశ్రుతులు దొర్లకుండా గణేష్ నిమజ్జనం చేపట్టాలని జిల్లా ఎస్పీ జగదీష్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎస్పీ పంపనూరు సమీపంలోని వినాయక నిమజ్జనం ప్రాంతాన్ని సందర్శించారు. గణేష్ ప్రతిమలను కాలువ నీటిలో నిమజ్జనం చేయడాన్ని పర్యవేక్షించారు.
టెర్రరిస్టుల పాలనను తలపించేలా గత ఐదేళ్లలో జగన పాలన సాగించాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మండిపడ్డారు. సోమవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్మొద్దీన, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి గాజుల ఆదెన్నలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాప్తాడు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎక్కడా తేడా రాకూడదని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సోమవారం అనంతపురంలోని ఆమె నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులతో పరిటాల సునీత సమావేశమయ్యారు.
ఆ రోడ్డు నిత్యం రద్దీతో ఉంటుంది. గ్రామాల నుంచి వివిధ పనులు నిమిత్తం వచ్చేవారు కొందరైతే... జిల్లా కేంద్రం నుంచి కళాశాలలు, గ్రామాలకు వెళ్లే వారు మరికొందరు. వందల వాహనాలు ఆ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.
సత్యసాయి తాగునీరు సరఫరా చేసే కార్మికులు సమ్మెలో భాగంగా ఆదివారం నా లుగో రోజు ఆత్మకూరు లోని సత్యసాయి వాటర్ సప్లై పంప్ హైస్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఆర్నెల్లుగా తమకు జీతాలు ఇవ్వకుంటే కుటుంబ పోషణ ఎలా? అని ప్రశ్నించారు.ప్రబుత్వం వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఐదు నెలలైనా జీతాలు ఇవ్వలేదు, ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నామని వేడుకుంటూ అధికారులు కనికరించడం లేదు, పండుగకు కూడా జీతాలు ఇవ్వకుండా పస్తులు పెడతారా అంటూ ఆస్పత్రి పారిశుధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.