Home » Anantapur urban
దేశం, సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక బుడ్డప్పనగర్‌లో ఉన్న నెహ్రూ యువకేంద్రం కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తూ ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో విత్తనాన్ని అందిస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు.
పాఠశాల వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు నగర్లో ప్రభుత్వ పాఠశాలను ఎంపీ, ఎమ్మెల్యేలు గురువారం తనిఖీ చేశారు.
చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన జ్వర పీడితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి వైద్యసేవలు అందించాలని డాక్టర్లకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్వెంకటేశ్వరరావు సూచించారు.
నియోజకవర్గంలో సాగు, తాగునీటికి సమస్యల లేకుండా చూడాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. దీనిపై కలెక్టర్ వినతి పత్రం అందజేశారు.
సమాజానికి వెలు గు ఉపాధ్యాయుడని ప్రభుత్వ పెన్షనర్ల సం ఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్ అన్నారు. గురువారం పెన్షనర్స్ భవనలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముం దుగా సర్వేపల్లి రాధాకృష్ణన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బీసీ సంక్షేమశాఖలో ఓ అధికారి తీరు ఆ శాఖలోని పలువురు ఉద్యోగులను ఇబ్బందుల పాలు చేసింది. ఆ అధికారి ఉద్యోగంలో చేరేందుకు వచ్చిందే అడ్డదారి... అయిన్పటికీ జిల్లా, రాష్ట్రస్థాయిలోని కొందరు అధికారుల ప్రోత్సాహంతో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఓ డివిజనను పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నారు.
జిల్లాలో 2023 ఖరీఫ్, రబీ ఇన్సురెన్స ప్రకటించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో 9 నుంచి 23వ తేదీ వరకు గ్రామ, మండల కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి జోనల్ మలేరియా అధికారి డాక్టర్ లక్ష్మానాయక్ ఆదేశించారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు.