Home » Anantapur
రాష్ట్రంలో హింస లేని సమా జాన్ని నిర్మించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పేర్కొన్నారు. హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో నగరంలోని క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా శ్రీకంఠం సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మా జీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
కార్తీక సోమవార పూజలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ మాసంలో చివరి సోమవారం కావడంతో జిల్లాలోని శివాలయాలు, పర మేశ్వరుడి సమేత అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజామునే చన్నీటి స్నానమాచరించి, ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకుని దీపాలు వెలిగించి పరమేశ్వరుడికి హారతులు పట్టారు.
క్రీడలకు, క్రీడాకారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక అశోక్‌నగర్ డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఆదివారం 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన కరాటే రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిం చారు.
మండలంలోని హంపాపురం సమీపం లో ఉన్న మౌనగిరి హనుమన క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. మౌనగిరి క్షేత్రం ఏడో వార్షికోత్సవం సందర్బంగా పరిటాల కుటుంబ సభ్యులు అక్కడి ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటూ పరిటాల శ్రీరామ్, పరిటాల జ్ఞాన దంపతులు స్వామి వారికి పట్టు వసా్త్రలు సమర్పించారు.
అనంత రైల్వే స్టేషన సమస్యలకు నిలయంగా తయారైంది. చాలా అసౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు చేరాలంటే నరకప్రాయంగా మారింది. మెట్లు ఎక్కాలంటే చేతకా దు. ట్రాక్‌పై వెళ్లాలంటే ప్రమాదకరం. లిఫ్ట్ నిర్మాణ ప నులు నత్తనడకే నయం అన్న చందంగా సాగుతు న్నాయి.
తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ నగరంలో మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో శనివారం పాతూరులోని గాంధీబజార్లో చెట్ల కొమ్మలతో రోడ్లు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు.
జిల్లా అండర్-23 పురుషుల క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన జట్టు వివరాలను శనివారం స్థాని క అనంత క్రీడా గ్రామంలో జిల్లా క్రికెట్ సంఘం ఇనచార్జి సెక్రటరీ భీమలింగారెడ్డి ప్రకటించారు.
టీడీపీ సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరు బాధ్యాతగా తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని పూర్తీ చేసి రాప్తాడు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నారు. మండలాలలో చేపట్టిన సభ్యత్వ ప్రక్రియపై ఆమె శనివారం టీడీపీ చెన్నేకొత్తపల్లి, రామగిరి కార్యాలయాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, బూతల వారీగా సభ్యత్వ నమోదు వివరాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...నియోజకవర్గంలో చెన్నేకొత్తప ల్లి, రామగిరి మండలాలు వెనుకంజలో ఉన్నాయన్నారు.
దాదాపు రెండు దశాబ్దాల కు పైగా మరుగన పడిన బ్రిడ్జి నిర్మాణా నికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. దీంతో ఆయా గ్రామాల ప్రజల ఆశల కు మోసులొచ్చాయి. పామిడి మండలం కత్రిమల, కోనేపల్లి, కోనేపల్లి తండా తదితర గ్రామాల ప్రజలు, రైతులు ని త్యం బ్యాంకు తదితర పనుల కోసం గార్ల దిన్నె మండలంలోని పెనకచెర్ల డ్యాం గ్రామానికి వెళ్తుంటారు. అలాగే ఆయా గ్రామాల విద్యార్థులు పెనకచెర్ల డ్యాం లోని పాఠశాలకు వెళ్తారు. అయితే వారికి సరైన దారి లేదు.
నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సంబంధిత మంత్రులకు విన్నవించా రు. ఆమె గురువారం అసెంబ్లీ సమావేశం అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవదాయ శాఖ మంత్రి అనం నారాయనరెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో అ శాఖలకు సంబంధించిన సమస్యలను వారికి వివరించారు.