BRIDGE : కత్రిమల బ్రిడ్జికి మోక్షం
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:49 AM
దాదాపు రెండు దశాబ్దాల కు పైగా మరుగన పడిన బ్రిడ్జి నిర్మాణా నికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. దీంతో ఆయా గ్రామాల ప్రజల ఆశల కు మోసులొచ్చాయి. పామిడి మండలం కత్రిమల, కోనేపల్లి, కోనేపల్లి తండా తదితర గ్రామాల ప్రజలు, రైతులు ని త్యం బ్యాంకు తదితర పనుల కోసం గార్ల దిన్నె మండలంలోని పెనకచెర్ల డ్యాం గ్రామానికి వెళ్తుంటారు. అలాగే ఆయా గ్రామాల విద్యార్థులు పెనకచెర్ల డ్యాం లోని పాఠశాలకు వెళ్తారు. అయితే వారికి సరైన దారి లేదు.
రెండు దశాబ్దాల తరువాత
నిధుల మంజూరు
నిర్మాణం పూర్తి అయితే
మూడు మండలాలకు ప్రయోజనం
గార్లదిన్నె, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): దాదాపు రెండు దశాబ్దాల కు పైగా మరుగన పడిన బ్రిడ్జి నిర్మాణా నికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. దీంతో ఆయా గ్రామాల ప్రజల ఆశల కు మోసులొచ్చాయి. పామిడి మండలం కత్రిమల, కోనేపల్లి, కోనేపల్లి తండా తదితర గ్రామాల ప్రజలు, రైతులు ని త్యం బ్యాంకు తదితర పనుల కోసం గార్ల దిన్నె మండలంలోని పెనకచెర్ల డ్యాం గ్రామానికి వెళ్తుంటారు. అలాగే ఆయా గ్రామాల విద్యార్థులు పెనకచెర్ల డ్యాం లోని పాఠశాలకు వెళ్తారు. అయితే వారికి సరైన దారి లేదు. దీంతో పెనకచెర్ల కొత్తపల్లి, డ్యాం గ్రామాల మధ్య ఉన్న పెన్నానదిని దాటుకుని వెళ్తుం టారు. అయితే నదిలో నీరు ప్రవహిస్తే అనేక అవ స్థలు పడాల్సి ఉంది. దీంతో పెన్నానదిపై బ్రిడ్జి నిర్మిస్తే పామిడి, గార్ల దిన్నె మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భా వించింది. అప్పట్లో గార్లదిన్నె ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 15 కోట్లు మం జురు చేశారు. కారణాలు తెలియ దు కానీ బ్రిడ్జి నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది. ఆ తరువాత ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు అవసరమైన నిధుల మంజురుకు ఆమోదం తెలిపింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే గార్లదిన్నె మండలంలోని పెనకచెర్ల, డ్యాం గ్రామా లతో పాటు పామిడి మండలంలోని కత్రి మల, పాళ్యం, తండా, వెంకటాంపల్లి తండా, పందికుంట, ఎద్దులపల్లి తదితర గ్రామాల రైతులకు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. అదేవి ధంగా కూడేరు మండలంలోని పలు గ్రామాల ప్రజలకూ ఉపయోగమని పలువురు అంటున్నారు.
త్వరలోనే టెండర్లు నిర్వహిస్తాం - మురళీధర్, పంచాయతీ రాజ్, పీఐటీయూ డీఈఈ
బ్రిడ్జి నిర్మాణంలో ఆలస్య మైన విషయం వాస్తవమే. బ్రిడ్జి నిర్మాణానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 15 కోట్లు నిధులు మంజురు చేసింది. అయితే కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతో పిల్లర్ల వరకే నిలచి పోయింది. పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వంలో నబార్డుకు నిఽవేధికలు పంపాం. ప్రసుత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవసరమైన నిధులు మంజురయ్యాయి. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....