Home » Anantapur
పేదలకు అండగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని గురవయ్యసేను కొట్టాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సం క్రాంతి కానుకగా కొత్త పింఛన్లు, రేషనకార్డులు అందజేస్తారని ఎమ్మెల్యే పరి టాల సునీత తెలిపారు. నియోజవర్గ కేంద్రమైన రాప్తాడులో శనివారం ఎ మ్మెల్యే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గోకులం షెడ్లను అధికారులతో కలిసి ప్రా రంభించా రు.
గత వైసీపీ ప్రభు త్వ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఎమ్మెల్యే దగ్గు పాటి వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. అనంతపురం అర్బన పరిధిలోని 9, 49వ డివిజనలలో శనివారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యా దవ్‌తో కలిసి ఎమ్మెల్యే పలువురు లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
పేరుకే నియోజకవర్గం కేంద్రం. ఎంతమంది పాలకులు మా రినా శింగనమల అభివృద్ధి శూన్యం. గ్రా మాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా మని గతంలో పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా ఇంతవరకు చొరవ చూకపోవడం కొస మెరపు. 1952లో పుట్లూరు నియోజకవ ర్గం నుంచి శింగనమల నియోజకవర్గం గా మారింది.
ఆర్డీటీ, జిల్లా క్రికెట్ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్ పోటీలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయని జిల్లా క్రికెట్ అసోసియేషన అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా క్రికెట్ సంఘం, ఆర్డీటీ సంయుక్తంగా శుక్రవారం స్థానిక తపోవనం క్రికెట్ గ్రౌండ్స్ లో అండర్-15 బాలుర రూరల్ క్రికెట్ లీగ్-2024 క్వాలిఫయర్ మ్యాచ నిర్వ హించారు.
మండలపరిధిలోని ఉప్పరపల్లి సమీపంలో అంగనవాడీలకు ఇచ్చి న ఇళ్ల స్థలాల్లో ఫెన్సింగ్ వేయడానికి కొందరు శుక్రవారం ప్రయత్నించారు. దానిని సంబంధి త అంగనవాడీలు అడ్డుకున్నారు. విషయం తె లుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను తహసీల్దార్ వద్దకు వెళ్లి నచ్చచెప్పి పంపివే శారు.
వైసీపీకి ఓటు వేయలేదన్న కార ణంతో 40వ డివిజనపై కక్షకట్టి గత నాలుగేళ్లల్లో ఒక్క పని కూడా చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నాగరాజుతో కలిసి 40వ డివిజనలోని ఆజాద్ నగర్లో పర్యటిం చారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్డు నిర్లక్ష్యాని గురయ్యా యి. కొన్నింటికి నిధులు మంజూరైనా ప్రజా ప్రతిని ధులు తారురోడ్లు వేయలేకపోయారు. దీంతో ఆ గ్రా మాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడా ్డరు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూ రు చేసి, పనులు ప్రారంభించడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chief Minister Nara Chandrababu Naidu) శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా బొమ్మనహాల్ మండలం నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్వయంగా ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీలో భాగస్వాములవుతున్నారు.
వైసీపీ పాలనలో గ్రామ పంచాయ తీలను సమస్యలకు నిలయాలుగా మార్చారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మండ లంలోని రుద్రంపేట పంచాయితీ లో గురువారం మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్ర మాన్ని చేపట్టారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో సమస్యలను తెలుసుకు న్నారు. డ్రైనేజీలు, రోడ్లు, వీధిలైట్ల సమస్యలను వా రు ఎమ్మెల్యే దృష్టికితీసుకెళ్లారు.