ATTEMPTING : ఇళ్ల స్థలాల్లో ఫెన్సింగ్‌కు యత్నం
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:18 AM
మండలపరిధిలోని ఉప్పరపల్లి సమీపంలో అంగనవాడీలకు ఇచ్చి న ఇళ్ల స్థలాల్లో ఫెన్సింగ్ వేయడానికి కొందరు శుక్రవారం ప్రయత్నించారు. దానిని సంబంధి త అంగనవాడీలు అడ్డుకున్నారు. విషయం తె లుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను తహసీల్దార్ వద్దకు వెళ్లి నచ్చచెప్పి పంపివే శారు.
అనంతపురం రూరల్, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని ఉప్పరపల్లి సమీపంలో అంగనవాడీలకు ఇచ్చి న ఇళ్ల స్థలాల్లో ఫెన్సింగ్ వేయడానికి కొందరు శుక్రవారం ప్రయత్నించారు. దానిని సంబంధి త అంగనవాడీలు అడ్డుకున్నారు. విషయం తె లుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను తహసీల్దార్ వద్దకు వెళ్లి నచ్చచెప్పి పంపివే శారు. ఈసందర్భంగా అంగనవాడీ వర్కర్లు మాట్లాడుతూ... 2004 నుంచి బీఎల్‌ఓలుగా పనిచేస్తున్న 69మందికి 2011లో ఉప్పరపల్లి సర్వే నంబరు 107-1నుంచి 107 - 7 వరకు ఒకటిన్నర సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇ చ్చారన్నారు. అయితే అక్కడ అప్పట్లో అనువు గా లేకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేదన్నారు. అయితే గత నాలుగైదేళ్లుగా ఇళ్ల నిర్మాణానికి వెళ్లినప్పుడల్లా ఎవరో ఒకరు రావడం భూమి తమదంటూ అడ్డుపడు తున్నారని వాపోయా రు. కొన్నినెలలుగా బంగి భాస్కర్, అతడి కు టుంబ సభ్యులు ఇదేవిధంగా అడ్డుపడుతున్నా రన్నారు. ఈ రోజు కూడా తమ స్థలాల్లో వారు ఫెన్సింగ్ వేస్తుండగా అడ్డుకున్నామన్నారు. ఇ ప్పటికే పలుమార్లు అధికారులను, ప్రజాప్రతి నిధులను కలసి సమస్యను పరిష్కరించాలని కోరామన్నారు. కార్యక్రమంలో అంగనవాడీ కార్యకర్తలు అనసూయ, వరలక్ష్మి, లక్ష్మీనరస మ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....