Share News

MLA SUNITA : సంక్రాంతికి కొత్త పింఛన్లు, రేషన కార్డులు

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:09 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సం క్రాంతి కానుకగా కొత్త పింఛన్లు, రేషనకార్డులు అందజేస్తారని ఎమ్మెల్యే పరి టాల సునీత తెలిపారు. నియోజవర్గ కేంద్రమైన రాప్తాడులో శనివారం ఎ మ్మెల్యే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గోకులం షెడ్లను అధికారులతో కలిసి ప్రా రంభించా రు.

MLA SUNITA : సంక్రాంతికి కొత్త పింఛన్లు, రేషన కార్డులు
MLA Paritala Sunitha distributing pensions in Raptadu

ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సం క్రాంతి కానుకగా కొత్త పింఛన్లు, రేషనకార్డులు అందజేస్తారని ఎమ్మెల్యే పరి టాల సునీత తెలిపారు. నియోజవర్గ కేంద్రమైన రాప్తాడులో శనివారం ఎ మ్మెల్యే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గోకులం షెడ్లను అధికారులతో కలిసి ప్రా రంభించా రు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వంలో ఎ క్కువ సంఖ్యలో పింఛన్లు, రేషనకార్డులు తొలగించారన్నారు. అలా పింఛను, రేషనకార్డు కోల్సోయిన వారు, కొత్త వారు డిసెంబరులో దరఖాస్తు చేసుకుం టే సంక్రాంతి కానుకగా అందజేస్తామన్నారు. అలాగే జిల్లాలో తొలి గోకులం షెడ్డు పూర్తి చేసింది రాప్తాడు మండల కేంద్రంలోనే అన్నారు. వచ్చే నెలలో మొత్తం అన్ని షెడ్లు పూర్తి చేసి ప్రారంభిస్తామని, త్వరలోనే రాప్తాడులో రో డ్లు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ అనూరాధ, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్‌ విజయకుమారి, టీడీపీ నాయకులు ధర్మవరపు మురళి, సర్పంచ సాకే తిరుపాలు, మండల కన్వీనర్‌ కొండప్ప, శ్రీనివా సులు, గంగలకుంట రమణ, గోనిపట్ల శీన, ఇంద్ర, బీరన్న, నారా యణస్వా మి, మరూరు గోపాల్‌, కిష్ట, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శివ, అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 01 , 2024 | 12:09 AM