Home » AP Assembly Elections 2024
ఇటీవలి ఎన్నికల ఫలితాలతో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పీడ విరగడై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విముక్తి దొరికిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ప్రమాణం చేయబోతున్నారు. శుక్రవారం నాడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులందరికీ సాధారణ పరిపాలన శాఖ సచివాలయంలో చాంబర్లు కేటాయించింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచి ప్రారంభమవుతాయి. ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సీనియర్ సభ్యుడిని ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ నామినేట్ చేస్తారు.
ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరిదంటే.. డిప్యూటీ సీఎం ఉన్నా.. హోం శాఖ మంత్రిదేనన్నది సుస్పష్టం. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులకు తాజాగా శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితకు హోం శాఖను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాల ముందు ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది... ఈ పార్టీ గద్దెనెక్కుతుందంటూ పలు సర్వే సంస్థలు వరుసగా ప్రకటించాయి.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రం(మోడల్ స్టేట్)గా తీర్చిదిద్దుతానని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ఐదేళ్లుగా కుంటుపడిందని, తక్షణమే దాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఎక్కడా మాటతప్పమని చెప్పలేదు లేదు.. ఎక్కడా మడం తిప్పమని అనలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలూసులు ఎత్తలేదు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో అదే చెప్పారు. ఎక్కడ డొంక తిరుగుడు లేదు. చేసేదే చెబుతానన్నారు. అంతా సూటిగానే చెప్పారు.
తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు.