Share News

Kinjarapu Rammohan Naidu: సివిల్‌ ఏవియేషన్‌లో మోడల్‌ స్టేట్‌గా ఏపీ

ABN , Publish Date - Jun 14 , 2024 | 05:49 AM

పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రం(మోడల్‌ స్టేట్‌)గా తీర్చిదిద్దుతానని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ఐదేళ్లుగా కుంటుపడిందని, తక్షణమే దాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Kinjarapu Rammohan Naidu: సివిల్‌ ఏవియేషన్‌లో మోడల్‌ స్టేట్‌గా ఏపీ

  • పౌరవిమానయాన మంత్రిగా రామ్మోహన్‌ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రం(మోడల్‌ స్టేట్‌)గా తీర్చిదిద్దుతానని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ఐదేళ్లుగా కుంటుపడిందని, తక్షణమే దాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

గురువారం పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్‌నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత విమానయాన రంగాన్ని ప్రపంచస్థాయిలో అగ్రపథాన నిలిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. 2030 వరకు ఆ దిశగా ముందుకెళ్లేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ఎయిర్‌పోర్టులపై ఆ రాష్ట్రప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. విజయవాడ ఇంటిగ్రెటేడ్‌ టెర్మినల్‌ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.

Updated Date - Jun 14 , 2024 | 05:49 AM