Share News

YS Jagan: సాధారణ సభ్యుడిగానే వైఎస్ జగన్ ప్రమాణం..

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:50 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ప్రమాణం చేయబోతున్నారు. శుక్రవారం నాడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో..

YS Jagan: సాధారణ సభ్యుడిగానే వైఎస్ జగన్ ప్రమాణం..

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ప్రమాణం చేయబోతున్నారు. శుక్రవారం నాడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ (TDP, Janasena, YSRCP, BJP) తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేస్తారు. అసెంబ్లీలో మొదట సీఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు, మహిళా సభ్యులు సాధారణ సభ్యుల ప్రమాణం చేయనున్నారు. సాధారణ సభ్యుల ప్రమాణం పేరులో మొదటి అక్షరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ప్రమాణం ఉంటుంది. సీటింగ్ లేని కారణంగా కుటుంబ సభ్యులకు, సందర్శకులకు పాస్‌లు లేవని అసెంబ్లీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంటే.. పాస్‌లు ఇవ్వకపోవడంతో పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరూ ఉండటానికి వీల్లేదన్న మాట.

వైఎస్ జగన్‌తో ఉండేదెవరు.. ఊడిపోయేదెవరు..


YS-Jagan-Assembly-02.jpg

ఎమ్మెల్యేగా మాత్రమే..!

ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సాధారణ సభ్యుడిగా మాత్రమే ప్రమాణం చేయనున్నారు. పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్.. సాధారణ సభ్యుడిగా మాత్రమే ప్రమాణం చేయబోతున్నారు. అదెలాగంటే.. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరాతి ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ తరఫున గెలిచారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. ప్రతిపక్ష నేతగా ఉండే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఇక ఎమ్మెల్యేగా.. సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణం చేస్తారు. ఈయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేయబోతున్నారు. కాగా.. శుక్రవారం ఉదయం 9: 45 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంట్రీ ఇవ్వనున్నారు. అనంతరం జాతీయ గీతాలాపన ఉంటుంది. ఆ తర్వాతే.. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రొటెం స్పీకర్ ప్రకటన ఉండబోతోంది. ఇవన్నీ అయ్యాక శాసన సభ సభ్యుల ప్రమాణం ఉంటుంది.

ఐఏఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం


YS-Jagan-Assembly.jpg

ఫస్ట్ టైమ్!

వైసీపీ స్థాపించినప్పటి నుంచీ కనీసం ప్రతిపక్ష హోదా అయినా పార్టీకి ఉండేది. 2014లో ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఊహించని రీతిలో 151 సీట్లతో వైసీపీ అధికారం దక్కించుకుని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ.. ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా, భారీ విజయాన్ని కూడా దక్కించుకున్న వైసీపీ.. ఈసారి కనీసం ఆ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ప్రతిపక్షం, ప్రతిపక్ష నేతలేని అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాత్రమే..!. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయా..? వైసీపీ సభ్యుల పరిస్థితేంటి..? ఎవరేం మాట్లాడుతారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి.. అంతకుమించి ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..


Updated Date - Jun 20 , 2024 | 06:08 PM