Home » AP Election Counting
ఏపీలో స్పష్టమైన ఆధిక్యం దిశగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఇక కొన్ని జిల్లాల్లో అయితే ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్టు ప్రస్తుతం వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో అయితే ఒక స్థానం మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎవరికి అంతుపట్టడంలేదు. తుది ఫలితం కోసం చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 70 వరకు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి 30కి పైగా సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లతో పాటు మరోవైపు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు వైసీపీ నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. టెలికాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్, 3పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు.
కౌంటింగ్ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను సోమవారం బంద్ చేశారు. ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది షాపులకు సీల్ వేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుంచి, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల నుంచి బంద్ చేయించారు. పోలింగ్ రోజు అల్లర్లను దృష్టిలో ఉంచుకొని తాడిపత్రి నియోజకవర్గంలో ఈ నెల 5వతేదీ దాకా మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఈనెల 4వతేదీ దాకా మూసేస్తారు. దీంతో మద్యం ప్రియులు ‘మందు’ జాగ్రత్తలు తీసుకున్నారు. మద్యం...
నరాలు తెగే ఉత్కంఠకు తెరపడే సమయం వచ్చింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు మరికొన్ని గంటల్లో బహిర్గతం కానుంది. ఓటరు జాబితా తయారీ మొదలు.. పోలింగ్ ముగిసేవరకూ మునుపెన్నడూ లేనన్ని ప్రలోభాలు.. బెదిరింపులు, దాడులు చోటు చేసుకున్నాయి. అన్నింటినీ ఓ కంట కనిపెట్టిన ఓటరు.. మీట నొక్కి తన నిర్ణయం ప్రకటించాడు. అదేమిటో మంగళవారం తేలిపోతుంది. జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఫలితాలు సాయంత్రానికల్లా వచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు నియోజకవర్గాలు ఆలస్యమైనా.. రాత్రికి మాత్రం తుది ఫలితాలు అధికారికంగా బయటకు వస్తాయి. మే 13న పోలింగ్ ముగిశాక.. మూడు వారాల...
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేయించారు. ఎస్పీ గౌతమిశాలి నేతృత్వంలో కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జేఎనటీయూలోని కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతపురం పార్లమెంటు స్థానంతోపాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం(అర్బన), కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల ...
కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandra Babu Naidu) సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్‌కు సంబంధించి కేడర్‌కు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) గెలిచేదెవరు..? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు..? ఎవర్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అక్షరాలా నిజమవుతాయా..? లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా..? 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసిన 2,383 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని.. 3.33 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు..