Home » AP Election Results 2024
ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, ఆ తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతలను పరిరక్షించడం అవశ్యం అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు ఆయన లేఖ రాశారు.
పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేశాం.. ఇక ప్రమాణ స్వీకారం, సంబరాలే ఆలస్యం అన్నట్లుగా అసలు సిసలైన ఫలితాలకు ముందే తెగ హడావుడి చేస్తున్న వైసీపీకి ఊహించని ఝలక్ తగిలింది...
aaraa poll strategies post poll Prediction on Pithapuram Assembly Seat AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్‌పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు.
ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వరుసగా ఎగ్జిట్‌పోల్స్ వెలువడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఒక్కో సర్వే సంస్థ తమ ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్‌పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్.. ఎన్నికల పోలింగ్ తర్వాత, ఫలితాలకు ముందు వచ్చే సర్వేలు.! సెమీ ఫైనల్ లాంటి ఈ ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. వాస్తవానికి పోలింగ్ రోజు లేదా ఆ తర్వాత రోజు రావాల్సిన ఎగ్జిట్ పోల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యి.. దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆలస్యం కాస్త జూన్-01 వరకూ వెళ్లింది. దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు పూర్తవ్వడంతో ఇవాళ అనగా శనివారం నాడు..