AP Exit Polls: పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతోంది.. ఓటరు తీర్పును ప్రభావితం చేసిన అంశాలు ఇవే..!
ABN , Publish Date - Jun 01 , 2024 | 06:44 PM
ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వరుసగా ఎగ్జిట్‌పోల్స్ వెలువడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఒక్కో సర్వే సంస్థ తమ ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి.
ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వరుసగా ఎగ్జిట్‌పోల్స్ వెలువడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఒక్కో సర్వే సంస్థ తమ ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని మెజార్టీ సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. దాదాపు వందకు పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ఎక్కువ సంస్థలు అంచనా వేశాయి.
AP Election Exit Polls 2024: ఏపీలో గెలుపెవరిది.. ఒకే ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి..
పల్స్‌టుడే అంచనాలు ఇవే..
పల్స్‌టుడే ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 125 సీట్లు వస్తాయని.. వైసీపీ 50 సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది. లోక్‌సభ స్థానాల్లో 19 నుంచి20 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ.. 5 నుంచి 6 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. జిల్లాల వారీ ఈ సంస్థ తమ ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో 52 శాసనసభ స్థానాలు ఉండగా టీడీపీ కూటమి 29, వైసీపీ 23 స్థానాల్లో గెలుస్తుందని ఈ సంస్థ అంచనా వేసింది. ఉత్తరాంధ్రాలో 34 శాసనసభ స్థానాలు ఉండగా టీడీపీ కూటమి 23, వైసీపీ 11 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. కూటమి 28, వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధించనుందని పల్స్‌టుడే అంచనావేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 33 స్థానాలు ఉండగా కూటమి 27, వైసీపీ 6 స్థానాల్లో గెలుస్తుందని ఈ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూటమి 18, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పల్స్‌టుడే అంచనా వేసింది.
AP Exit Polls 2024: ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News