Home » AP Govt
సామాజిక బాధ్యతగా సీఎం సహాయ నిధికి విరాళం అందించానని సీనియర్ జర్నలిస్టు అంకబాబు చెప్పారు. ఇది ఓ జర్నలిస్టుగా తన బాధ్యత అని వివరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలో సిలికాన్ వ్యాలీగా మార్చడానికి చంద్రబాబు నాయకత్వం వహించారని ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సొల్హెమ్ గుర్తుచేశారు. గ్లోబల్ ఐటీ నాయకులతో కలిసి చంద్రబాబు పని చేశారని కొనియాడారు.
రూ.110 కోట్ల డైట్ ఛార్జీల బకాయిలు విడుదలకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని, రూ.20.52 కోట్ల కాస్మొటిక్ ఛార్జీల బకాయిల విడుదలకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి సవిత చెప్పారు. వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు రూ.10 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరణ చేస్తున్నట్లు చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ భూతాన్ని పైకి రాకుండా చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు అమానుష ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు( మంగళవారం) గ్రీవెన్స్‌లో అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన సమస్యను అధికారులకు విన్నవించింది. బాధిత మహిళ ఫిర్యాదును అధికారులు విని చలించిపోయారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటువేయలేదని బహిర్భూమికి వెళ్లిన తనను అత్యాచారం చేసినట్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది.
ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడిన పడవల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ పడవలను తొలగించడం కష్టంగా మారింది. బ్యారేజీ వద్ద నుంచి బండ రాళ్ల దాటి ముందుకు అబ్బులు టీం సభ్యులు తీసుకువచ్చారు. సూయుజ్ గేట్లు వద్ద సేఫ్టీ వాల్ ఉన్న కారణంగా వ్యూహం మార్చారు. సేఫ్టీ వాల్ దెబ్బ తినకుండా వేరే విధానం అమలు చేసి బోట్స్ బయటకు తీయాలని నిర్ణయం తీసుకున్నారు.
బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే.. నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపణలు చేశారు. నీలి మీడియాలో మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వాని కేసుకు దేశవ్యాప్త మద్దతు లభిస్తుందని అన్నారు.
గుజరాత్‌లోని గాంధీ నగర్లో జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం) సందర్శించారు.
విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 2014లో ఏపీలో సౌర, పవన విద్యుత్ ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందని అన్నారు. గతంలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండేవని చెప్పారు.
విశ్వ విద్యాలయాలను ప్రక్షాళన చేయాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (X) ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. విద్యా సంస్థాగత సాధికారత దిశగా గొప్ప చొరవ తీసుకున్నందుకు నారా లోకేష్‌కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.