Share News

CM Chandrababu: ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు

ABN , Publish Date - Sep 16 , 2024 | 09:49 PM

విద్యుత్‌ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 2014లో ఏపీలో సౌర, పవన విద్యుత్‌ ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రస్తుతం గ్రీన్‌ ఎనర్జీ రెవల్యూషన్‌ మొదలైందని అన్నారు. గతంలో విద్యుత్‌ కోతలు తీవ్రంగా ఉండేవని చెప్పారు.

CM Chandrababu: ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు

అమరావతి: రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024లో వివరించారు. ఈరోజు(సోమవారం) గుజరాత్‌లో సీఎం చంద్రబాబు పర్యటించారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2024 నాలుగో విడత సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈరోజు(సోమవారం) జరిగింది.

గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ పటేల్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు కోరారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... విద్యుత్‌ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని చెప్పారు. 2014లో ఏపీలో సౌర, పవన విద్యుత్‌ ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రస్తుతం గ్రీన్‌ ఎనర్జీ రెవల్యూషన్‌ మొదలైందని అన్నారు. గతంలో విద్యుత్‌ కోతలు తీవ్రంగా ఉండేవని చెప్పారు. క్లీన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ను ప్రమోట్‌ చేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.


గ్రీన్ ఎనర్జీ కారిడార్లను సరిగా నిర్వహించాల్సి ఉందని చెప్పారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ల ద్వారా ట్రాన్స్‌మిషన్‌ చేయాలని సూచించారు. మాన్యుఫ్యాక్చరింగ్‌ ఎకో సిస్టమ్‌ను ప్రమోట్‌ చేయాలని అన్నారు. క్లీన్‌ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆకర్షించాలని సీఎం చంద్రబాబు చెప్పారు.


క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌ ద్వారా ఉపాధి కల్పన చేస్తున్నట్లు వివరించారు. ఏపీలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఉత్తమ విధానాల ద్వారా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించినట్లు వెల్లడించారు. గతంలో ఐటీని ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్‌ నుంచి వచ్చిన వారు ఉన్నారని సీఎం చంద్రబాబు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Narayana: రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు
Prakasam Barrages: పడవల తొలగింపులో కొత్త విధానానికి శ్రీకారం ...

Read LatestAP NewsANDTelugu News

Updated Date - Sep 16 , 2024 | 10:25 PM