AP NEWS: నెల్లూరు జిల్లాలో దారుణం.. వైసీపీకి ఓటువేయలేదని మహిళపై అమానుషంగా...
ABN , Publish Date - Sep 17 , 2024 | 06:56 PM
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు అమానుష ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు( మంగళవారం) గ్రీవెన్స్‌లో అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన సమస్యను అధికారులకు విన్నవించింది. బాధిత మహిళ ఫిర్యాదును అధికారులు విని చలించిపోయారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటువేయలేదని బహిర్భూమికి వెళ్లిన తనను అత్యాచారం చేసినట్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది.
నెల్లూరు: ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో ఇష్టారీతిగా వ్యవహరించిన వైసీపీ నేతల ఆగడాలు ఇంకా తగ్గడంలేదు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ నేతల చేష్టలు పెరిగిపోతున్నాయి. వీరి ఆగడాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు పెను సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వైసీపీ నేతలపై పలు ఆరోపణలు వచ్చాయి.
ALSO READ: AP Liquor Policy: నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన మాటలివే...
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు అమానుష ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు( మంగళవారం) గ్రీవెన్స్‌లో అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన సమస్యను అధికారులకు విన్నవించింది. బాధిత మహిళ ఫిర్యాదును అధికారులు విని చలించిపోయారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటువేయలేదని బహిర్భూమికి వెళ్లిన తనను అత్యాచారం చేసినట్లు గ్రీవెన్స్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరింది.
ALSO READ: Peethala Sujatha: జత్వానీ కేసులో భయంతోనే.. నీలి మీడియా తప్పుడు రాతలు: పీతల సుజాత
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓటు వేశానన్న కక్షతో ఎస్సీనైన తనపై అత్యాచారం చేసి చంపాలని చూశారని నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం తూర్పు పోలినేని పాలెం గ్రామానికి చెందిన బాధితురాలు ప్రజా దర్బార్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. బహిర్భూమికి వెళ్లగా తనను అత్యాచారం చేశారని వాపోయింది. నిందితులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని ఆమె ఈరోజు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. స్థానిక ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను బాధితురాలు వివరించింది. దోషులకు కఠిన శిక్షపడేలా బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
AP NEWS: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపులో పురోగతి
Pawan: అభివృద్ధిలో తెలంగాణ ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ..
AP Cabinet: రేపే ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే.
Read LatestAP NewsAndTelugu News