Home » AP Govt
విశ్వ విద్యాలయాలను ప్రక్షాళన చేయాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (X) ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. విద్యా సంస్థాగత సాధికారత దిశగా గొప్ప చొరవ తీసుకున్నందుకు నారా లోకేష్‌కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
నరసాపురం ప్రజలు డంపింగ్ యార్డ్ లేక దశాబ్దాలుగా అవస్థలు పడ్డారని, పెండింగ్‌లో ఉండిపోయిన ఆ సమస్యకు అధికారులు పరిష్కారం చూపడం సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలంటూ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన రెండ్రోజుల్లోనే రూ.1.74కోట్లు అత్యవసర నిధి కింద విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని పవన్ అన్నారు.
వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి సూచించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడం వల్ల పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు.
రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్లకు వెళ్లారు. మంత్రి నారాయణ చొరవతో భూములిచ్చేందుకు రైతులుముందుకొస్తున్నారు.
విజయవాడలో పరిస్థితి మెరుగుపడిందని మంత్రి నారాయణ తెలిపారు. ఫైరింజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. ఈవిషయంపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశామని మంత్రి నారాయణ అన్నారు.
వైసీపీ పాలనలో రోడ్లు నిర్వీర్యమయ్యయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విమర్శలు చేశారు. దగదర్తి-బుచ్చిరెడ్డిపాలెం రోడ్డును పున ప్రారంభించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు భారీ బైక్ ర్యాలీ తీశారు.
విజయవాడలోని నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. న్యూ ఆర్.ఆర్.పేట,జక్కంపూడి సింగ్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తోందని కాసేపటి క్రితం నుంచి ప్రచారం జరుగుతోందని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
నూజివీడులోని ట్రిఫుల్ ఐటీ క్యాంపస్ వ్యవహారాల పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వివిధ ఆరోపణలపై ట్రిపుల్ ఐటీలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బుడమేరు గండ్లను 58 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా గట్ల మీదే మకాం వేసి పూడ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. మిలటరీ బలగాలు ఆశ్చర్యానికి లోనై ‘శభాష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని కొనియాడాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
Andhrapradesh: వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగిందని.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు.