Share News

Minister Narayana: చంద్రబాబు పాలనపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ధ్వజం

ABN , Publish Date - Sep 15 , 2024 | 06:25 PM

విజయవాడలో పరిస్థితి మెరుగుపడిందని మంత్రి నారాయణ తెలిపారు. ఫైరింజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. ఈవిషయంపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశామని మంత్రి నారాయణ అన్నారు.

Minister Narayana: చంద్రబాబు పాలనపై  వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ధ్వజం
Minister Narayana

విజయవాడ.: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ ఈరోజు(ఆదివారం) పర్యటించారు. కండ్రికలో జరుగుతున్న పారిశుధ్య పనులతో పాటు స్వయంగా ఇళ్లలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఏబీఎన్‌తో మాట్లాడుతూ... విజయవాడలో పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు.


ఫైరింజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. ఈ విషయంపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశామని మంత్రి నారాయణ తెలిపారు.


చంద్రబాబు పాలన దక్షత చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. విష ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నారాయణ హెచ్చరించారు.


బుడమేరుకు స్థాయికి మించి వరద..

‘‘విజయవాడ నగరంలో ఎక్కడ నీరు లేదు పూర్తిగా బయటకు వెళ్లిపోయింది. కృష్ణానదికి భారీగా వరదలు రావడం, బుడమేరుకు స్థాయికి మించి వరద రావడం మూడు ప్రాంతాల్లో గండ్లు పడటం వల్లే ఈ ఉపద్రవం ఏర్పడింది. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. బుడమేరు ప్రక్షాళన చేసి తీరుతాం. ఈ నెల 1వ తేదీ ఉదయం 8 గంటలకు బుడమేరులో ఒక అడుగు మాత్రమే వరద ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు మూడు అడుగులకు పైగా వరద పెరిగిపోయింది. బుడమేరు ప్రక్షాళనకు త్వరలోనే ఒక కంపెనీ వేస్తాం. బుడమేరు ప్రక్షాళనలో కొంత ఆక్రమించుకున్న వారికి ఇబ్బంది ఉండవచ్చు. బుడమేరులో ఎంత మేర ఆక్రమణలు ఉన్నాయో వాటన్నింటిని తొలగిస్తాం. బుడమేరు ఆక్రమణలో పేదలు ఎవరు ఉన్నా వారికి ఇబ్బందులు లేకుండా వారికి టిడ్కో ఇళ్లు ఇస్తాం’’ అని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.


ఆక్రమణలు తొలగింపుపై రాజీపడం..

‘‘బుడమేరు ఆక్రమణల తొలగింపు విషయంలో ఎక్కడా రాజీ పడం. ఏ పార్టీ వారు ఎంతటి బలవంతులు ఉన్న బుడమేరు ప్రక్షాళనలో ఎవర్ని ఉపేక్షించం. కొంత మంది కోసం 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. త్వరలోనే రామలింగేశ్వరం వద్ద రిటైనింగ్ వాల్‌ను కూడా ఎత్తు పెంచుతాం. స్ట్రాం వాటర్ డ్రైవ్ పనులు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఇంత విషమ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్యు మరేషన్ ప్రక్రియ పూర్తి అయింది. ఎవరికి ఎంత నష్ట పరిహారం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు’’ అని మంత్రి నారాయణ వెల్లడించారు.


ALSO READ: YS Sharmila: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్.. ఏమన్నారంటే?

జగన్‌కి వరదలపై మాట్లాడే అర్హత లేదు..

‘‘విజయవాడలో వచ్చిన భారీ వర్షాలతో చిరు వ్యాపారు పెద్దమొత్తంలో నష్టపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకుంటాయి. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను త్వరలోనే మరమ్మతులు పూర్తి చేస్తాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో రోడ్లు ఏ మేరకు దెబ్బతిన్నాయనేది ఎస్టిమేషన్స్ తయారు చేస్తున్నాం. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టగానే విజయవాడలో ఆగిపోయిన స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు ప్రారంభిస్తాం. మాజీ సీఎం జగన్‌కి వరదలపై మాట్లాడే అర్హత లేదు. ఎప్పుడూ జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు’’ అని మంత్రి నారాయణ ఆరోపించారు.


చంద్రబాబు నిర్ణయాలతో నష్టం తగ్గింది..

ఇప్పుడొచ్చిన వరదలకు వేలమంది చనిపోవాల్సి ఉంది. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో చాలామేరకు ప్రాణ నష్టం తగ్గింది. అధికారులు ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయలేదు. ఈనెల 17వ తేదీ నుంచి నష్టపరిహారం ఎవరెవరికి ఎంత చెల్లించాలో నిర్ణయం తీసుకుంటాం’’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLA Bonda Uma: నాయకుడు అంటే ఏంటో సీఎం చంద్రబాబు చూపించారు..

Nandigam Suresh: పోలీసు కస్టడికి మాజీ ఎంపీ నందిగం సురేష్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 15 , 2024 | 07:06 PM