AP News: సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి.. వైద్యశాఖ పలు సూచనలు
ABN , Publish Date - Sep 15 , 2024 | 10:09 PM
వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి సూచించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడం వల్ల పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు.
విజయవాడ: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి సూచించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడం వల్ల పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతుల నుంచి తక్షణ చికిత్స కోసం దగ్గలలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
సూచనలు , సలహాల కోసం స్థానిక ఏఎన్ఎంకు వెంటనే ఫోన్ చేయాలని అన్నారు. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. కాచి , చల్లార్చి, వడపోసిన నీటిణే తాగాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. కొబ్బరి చిప్పలు , టైర్లు, రోళ్లు , కూలర్లు , రోళ్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పారబోయాలని సూచించారు.
తద్వారా డెంగ్యూ దోమల లార్వాలు వృద్ధి చెందకుండా జాగ్రత్త పడాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108కి ఫోన్ చేయాలని తెలిపారు. జ్వరాలు, వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Steel Plant: ఆ విషయంలో కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలి: ఎమ్మెల్సీ బొత్స..
AP News: వైసీపీ నేతల మీద అక్రమ కేసులు.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు
YS Sharmila: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్.. ఏమన్నారంటే?