AP NEWS: వైసీపీ పాలనలో రోడ్లు నిర్వీర్యం.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విసుర్లు
ABN , Publish Date - Sep 15 , 2024 | 06:37 PM
వైసీపీ పాలనలో రోడ్లు నిర్వీర్యమయ్యయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విమర్శలు చేశారు. దగదర్తి-బుచ్చిరెడ్డిపాలెం రోడ్డును పున ప్రారంభించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు భారీ బైక్ ర్యాలీ తీశారు.
నెల్లూరు జిల్లా: వైసీపీ పాలనలో రోడ్లు నిర్వీర్యమయ్యయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విమర్శలు చేశారు. దగదర్తి-బుచ్చిరెడ్డిపాలెం రోడ్డును పున ప్రారంభించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు భారీ బైక్ ర్యాలీ తీశారు. దగదర్తిలో ఆశేష జన వాహిని నడుమ కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తుమ్మలపెంట, దగదర్తి నుంచి బుచ్చిరెడ్డిపాలెం వరకు రోడ్డు పనులు ప్రారంభించిందని తెలిపారు. త్వరలో అల్లూరు రాజుపాలెం రోడ్డు ప్రారంభిస్తామని చెప్పారు. ఆయా గ్రామాలను అనుసంధానం చేస్తూ లింక్ రోడ్లకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు.
DM, DR ఛానల్‌ను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దగదర్తిలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు 600 ఎకరాల భూమి సేకరణ జరుగుతుందని తెలిపారు. రామాయపట్నం పోర్టు అనుసంధానంగా త్వరలో పారిశ్రామిక వాడను నిర్మించబోతున్నట్లు వివరించారు. 40 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెల్లడించారు.