Home » AP New Cabinet
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లను ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను స్వయంగా ఇవ్వనున్నారు.
అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. ఈ క్యాంటీలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 203 అన్నా క్యాంటీన్లను 100 రోజుల్లో ఓపెన్ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని.. ఆ మేరకు స్థలాల సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే కొన్నిటిని గుర్తించామని వివరించారు.
ఒకటి రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి దోలా బాల వీరాంజనేయ స్వామి (Veeranjaneya Swamy) కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. రొట్టెల పండుగ సమయంలో అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లు మాత్రమేనని అయిదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయిని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు(బుధవారం) సచివాలయంలోని తన ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ రోజు ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవని.. మున్సిపల్ శాఖలో రూ.3500కోట్లు మాత్రమే ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ పాలనలో క్రమేణా దర్గాని అభివృద్ధి చేశామన్నారు.
ఖరీఫ్లో అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సూచించారు. ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలకు మార్పులు చేస్తోంది. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకం పేరును.. "అన్నదాత సుఖీభవ" గా (Annadata Sukhibhava) మార్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. అయితే కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలను మంత్రి కొలుసు పార్థసారధి (Kolusu Parthasarathy) వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. .ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు.