Home » Assembly elections
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ మళ్ళీ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వారం పర్యటన ప్రారంభించాలని విజయ్ భావిస్తున్నారు. ఈ విషయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమాలోచన చేస్తున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్ర చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడానికి ముందే ప్రధాన పార్టీలు ప్రచారం చేయడాన్ని చూస్తుంటే వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు భీకరయుద్ధాన్ని తలపించేలా జరగటం ఖాయమని ప్రముఖ సినీ గేయరచయిత, ఎంఎన్ఎం నేత స్నేహన్ అన్నారు.
బిహార్ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే ఆ పార్టీ పత్తాలేకుండా పోతుందని మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనాయకుడు ఆర్బీ ఉదయ్‌కుమార్ హెచ్చరించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలపనున్న 143 మంది అభ్యర్థుల జాబితాను రాష్ట్రీయ జనతా దళ్ ప్రకటించింది.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు సుమన్ ఓటర్లను అభ్యర్థించారు. యూసుఫ్‌గూడలో ఆదివారం నవీన్‌యాదవ్ తరపున ప్రచారం నిర్వహించారు.
నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) 40 మంది ప్రముఖలతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను శుక్రవారం నాడు విడుదల చేసింది. నితీష్ కుమార్‌తో పాటు సీనియర్ నేతలు సంజయ్ కుమార్ ఝా, రాజీవ్ రంజన్ సింగ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కలిగించినా అన్నాడీఎంకే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రెండో విడతగా అర్హులైన గృహిణులకు కలైంజర్ మహిళా సాధికార పధకం కింద ప్రతినెలా రూ.1000 చెల్లించనున్నట్లు ప్రత్యేక పథకాల అమలు మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ప్రకటించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షణలో గురువారం ర్యాండమైజేషన్ నిర్వహించారు.