West Bengal bypolls 2024: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తత, హింసాత్మక ఘటనలు
ABN , Publish Date - Nov 13 , 2024 | 06:05 PM
ఉపఎన్నికల పోలింగ్ క్రమంలో పశ్చిమబెంగాల్‌లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. నార్త్ 24 పరగణాల జిల్లా జగత్దాల్ ఏరియాలో గుర్తుతెలియని వ్యక్తులు టీఎంసీ నేతను కాల్చిచంపారు. అతనిని జగత్దాల్ 12వ నెంబర్ వార్డు టీఎంసీ మాజీ అధ్యక్షుడుగా పోలీసులు గుర్తించారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ (West Bengal)లోని 6 అసెంబ్లీ నియోజక వర్గాలకు బుధవారంనాడు పోలింగ్ జరుగుతుండగా, చెదురుమదురు హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భట్‌పరలో జరిగిన నాటుబాంబు దాడిలో స్థానికి టీఎంసీ కార్యకర్త ఒకరు మరణించారు.
Supreme Court: మీ కాళ్లపై మీరు నిలుచోవడం నేర్చుకోండి.. అజిత్ వర్గానికి సుప్రీం చురకలు
పలుచోట్ల హింసాత్మక ఘటనలు
ఉపఎన్నికల పోలింగ్ క్రమంలో పశ్చిమబెంగాల్‌లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. నార్త్ 24 పరగణాల జిల్లా జగత్దాల్ ఏరియాలో గుర్తుతెలియని వ్యక్తులు టీఎంసీ నేతను కాల్చిచంపారు. అతనిని జగత్దాల్ 12వ నెంబర్ వార్డు టీఎంసీ మాజీ అధ్యక్షుడు అశోక్ సాహుగా పోలీసులు గుర్తించారు. టీ స్టాల్ వద్ద అతను నిల్చుని ఉండగా అగంతకులు ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపినట్టు చెబ్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై టీఎంసీ, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. పలు నియోజకవర్గాల్లోని ఓటర్లలో భయాందోళనలు సృష్టించేందుకు టీఎంసీ బెదిరింపులకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించగా, ఆ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది.
సువేందు-ఘోష్ మాటల యుద్ధం
పోలింగ్ సందర్భంగా తలెత్తిన ఘటనలపై బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ, పలు పోలింగ్ బూత్‌ల వద్ద బీజేపీ కార్యకర్తలకు బెదిరింపులు వచ్చాయన్నారు. ఆ ఆరోపణలను టీఎంసీ ప్రతినిధి దీపక్ రాయ్ తోసిపుచ్చారు. టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారని, ఇందుకు భిన్నంగా విపక్షాలు తమను తప్పుపడుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో హింసకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు.
ఈవీఎం బటన్లకు టేప్‌లు
కాగా, కూచ్‌బెహర్‌లో ఒక ఈవీఎంలోని రెండు బటన్లను టేప్‌తో కవర్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తొలి రెండు బటన్లకు టేప్ చుట్టి ఉన్నట్టు బీజేపీ అభ్యర్థి దీపక్ రాయ్ ఆరోపించారు. ఇది ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు. బీజేపీ అభ్యర్థి నేరుగా బూత్‌లోకి వెళ్లి ఈవీఎం నుంచి టేప్‌ను తొలగించారు. దీనిపై రాయ్, ప్రిసైడింగ్ అధికారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హరొయలో తమ పోలింగ్ ఏజెంట్లను టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నట్టు ఇండియన్ సెక్యులర్ ఫ్రెంట్ ఆరోపించింది. దీంతో ఉభయ వర్గాల మధ్య చాలాసేపు వాగ్యుద్ధం చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి
Nitish Touch PM Feet: మళ్లీ మోదీ పాదాలకు మొక్కిన నితీష్
నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
For More National And Telugu News