Home » Ayodhya Ram mandir
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగనుండగా.. ఆ రోజు తరువాత భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ 200 స్పెషల్ రైళ్లు నడపడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆస్తా పేరుతో ప్రత్యేక రైళ్లు ప్రారంభించనుంది. దేశంలోని 66 ప్రధాన ప్రాంతాల మీదుగా అయోధ్య వరకు ఇవి నడవనున్నాయి.
అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమ తేది సమీపిస్తున్న కొద్దీ.. ఆలయ నిర్మాణ విశేషాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రజలు. ఎలాంటి భూకంపం, వరదలు వచ్చినా వెయ్యేళ్లపాటు తట్టుకునేలా ఆలయ డిజైన్ జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వారు అయోధ్యను ఒక ఇంజినీరింగ్ అద్భుతమని అభివర్ణిస్తున్నారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని(Ayodhya Ram Mandir) పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అనుస్థాన్(ప్రత్యేక జపం) పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జనవరి 12 నుంచి కఠిక నేలపై నిద్ర పోతున్నారు. ఉదయం లేవగానే యోగా, వ్యాయామం, ధ్యానం చేస్తూ గడుపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గురువారం గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని జనవరి 22న ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించేందుకు అనువుగా సెలవు మంజూరు చేసింది. ఆ రోజు ఉద్యోగులకు సగం పని దినాన్ని వర్తింపచేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ధ్రువీకరించారు.
రాముడిని బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని వివరించారు. హడావిడిగా 22వ తేదీన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని శంకరాచార్యులు, మఠాధిపతులు వ్యతిరేకించారని తెలిపారు.
ఈ నెల 22న జరగనున్న ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 550 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం కోసం యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పల్లె నుంచి పట్టణం వరకు అందరి దృష్టి రామాలయం ప్రారంభోత్సవం మీదనే ఉంది. పవిత్ర దినం జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది.
అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న ''రామ్ లల్లా'' విగ్రహం బుధవారంనాడు ఆలయ ప్రాంగణానికి ట్రక్కులో చేరుకుంది. దీంతో ''జై శ్రీరామ్'' నినాదాలు మిన్నంటాయి. గురువారం ఆలయ గుర్భగుడిలో రామ్లల్లాను ఉంచుతారని, శాస్త్రోక్తంగా పవిత్ర స్నానాలు, పూజాదికాలులతో పాటు ప్రతిష్ఠాపన ముందు జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఈనెల 21వ తేదీ వరకూ నిర్వహించి, 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రాణప్రతిష్ట జరుగుతుందని ఆలయ ట్రస్టు సభ్యులు తెలిపారు.
అయోధ్యలో రామ్ లల్లా ఆలయ నిర్మాణం పూర్తయిందని రామమందిరం నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారంనాడు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మిశ్రా తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రామలల్లా ఆలయంలో గర్భగుడి ఉందని, అది పూర్తయిందని వెల్లడించారు.
అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందిందా? వెళ్లే అవకాశం ఉందా? అనే విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారంనాడు స్పష్టత ఇచ్చారు. తనకు ఇంతవరకూ రమ్మని ఆహ్వానం రాలేదని, అయితే జనవరి 22 తర్వాత తన కుంటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని ఆయన చెప్పారు.