Home » Bangladesh Protests
రికార్డుల ప్రకారం బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉన్నారన్నారు. వారిలో 9 వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లోని భారతీయ రాయబార కార్యాలయాల సిబ్బంది.. భారతీయులను స్వచ్ఛందంగా స్వదేశానికి పంపుతున్నారని చెప్పారు.
అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక(Bangladesh Clashes) తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. నిరసనకారులు హసీనా భవనానికి సమీపిస్తున్నారని తెలియగానే.. ఆమె బృందం మొత్తం కట్టుబట్టలతో దేశాన్ని విడిచి వచ్చేసింది.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం కుప్పకూలడంతో.. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రధాని మోదీ(PM Modi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ప్రొ. మహమ్మద్ యూనస్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 15 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారని సమాచారం. దేశ ప్రధాని షేక్ హసీనా.. తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
ప్రధాని పదవి నుంచి వైదొలిగిన షేక్ హాసినా భారత్ నుంచి లండన్ వెళ్లి.. అక్కడ ఆశ్రయం పొందాలని ఆకాంక్షించారు. కానీ లండన్ మాత్రం అందుకు తమ నిబంధనలను ఒప్పుకోవని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు యూరోపియన్ దేశంలో ఆశ్రయం కల్పించే దిశగా భారత్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌లో తమ కుటుంబం గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుందన్నారు. కానీ ఈ సమయంలో వాళ్లను తాను చేరుకోలేనని చెప్పారు. ఇది తనను ఒకింత ఆందోళన కలిగించే పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమకు ఏఎంయూ ప్రొఫెసర్ల మద్దతు ఉందన్నారు. అలాగే భారతీయ విద్యార్థులు సైతం తమ పట్ల ఓదార్పుతో వ్యవహరిస్తున్నారని ఆమె వివరించారు.
రిజర్వేషన్ల రగడతో బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువత, ప్రజల టార్గెట్ మాత్రం హిందువులు, వారి ఇళ్లు అని తెలుస్తోంది. ఎక్కడ హిందువు ఇళ్లు, వ్యాపారి బిల్డింగ్ కనిపిస్తే చాలు.. ధ్వంసం చేసేందుకు క్షణం కూడా ఆలోచించడం లేదు. బంగ్లాదేశ్ అలర్లి మూకల చేతిలో ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద ఉంటోన్న ఇళ్లు ధ్వంసమైంది. 140 ఏళ్ల సంస్కృతికి అద్దం పట్టే గల ఇళ్లు చరిత్రగా మిగిలింది.
షెడ్యూల్ ప్రకారం బుధవారం ఢాకాకు రెండు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక విస్తారా, ఇండిగో విమాన సర్వీసులు సైతం షెడ్యూల్ ప్రకారం నడుస్తాయంది. విస్తారా ప్రతీ రోజు ముంబయి నుంచి ఢాకాకు విమాన సర్వీస్ నడుపుతుంది. ఢిల్లీ నుంచి ఢాకాకు మాత్రం వారంలో మూడు సర్వీసులను మాత్రమే నడుపుతుందని వెల్లడించింది.
షేక్ హసీనాతోపాటు ఆమె సోదరిని వెంటనే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఆ దేశపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ డిమాండ్ చేశారు. ఢాకాలో మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ మాట్లాడుతూ.. పొరుగనున్న భారత్‌తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవన్ కోరారు.