Bangladesh violence: ఢాకా నుంచి తిరిగొచ్చిన 205 మంది భారతీయులు
ABN , Publish Date - Aug 07 , 2024 | 12:36 PM
షెడ్యూల్ ప్రకారం బుధవారం ఢాకాకు రెండు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక విస్తారా, ఇండిగో విమాన సర్వీసులు సైతం షెడ్యూల్ ప్రకారం నడుస్తాయంది. విస్తారా ప్రతీ రోజు ముంబయి నుంచి ఢాకాకు విమాన సర్వీస్ నడుపుతుంది. ఢిల్లీ నుంచి ఢాకాకు మాత్రం వారంలో మూడు సర్వీసులను మాత్రమే నడుపుతుందని వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 07: బంగ్లాదేశ్ కల్లోలిత ప్రాంతంగా మారింది. ఈ నేపథ్యంలో దేశంలో పరిస్థితులు క్షణక్షణానికి మారిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో 205 మంది భారతీయులు బుధవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకున్నారు. వీరిని తీసుకు వచ్చేందుకు మంగళవారం రాత్రి ఈ ప్రత్యేక విమానాన్ని ప్రభుత్వం ఢాకా పంపింది. ఈ మేరకు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఢాకా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురు నవజాత శిశువులు ఉన్నారని తెలిపారు.
Also Read: Bangladesh: హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్
మరోవైపు ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఢాకాకు రెండు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక విస్తారా, ఇండిగో విమాన సర్వీసులు సైతం షెడ్యూల్ ప్రకారం నడుస్తాయంది. విస్తారా ప్రతీ రోజు ముంబయి నుంచి ఢాకాకు విమాన సర్వీస్ నడుపుతుంది. ఢిల్లీ నుంచి ఢాకాకు మాత్రం వారంలో మూడు సర్వీసులను మాత్రమే నడుపుతుందని వెల్లడించింది.
Also Read: Bangladesh violence: హిందూవులను కాపాడండి.. సద్గురు జగ్గీ వాసుదేవన్ విజ్ఞప్తి
ఎయిర్ ఇండియా అయితే ముంబయి, ఢిల్లీ, చెన్నయి మహానగరాల నుంచి ఢాకాకు ఓ సర్వీస్ నడుపుతుందని పేర్కొంది. ఇక కోల్‌కతా నుంచి ఢాకాకు ప్రతీ రోజు రెండు సర్వీసులు నడుస్తున్నాయని వివరించింది. మంగళవారం అంటే నిన్న మాత్రం ఇండిగో, విస్తారా విమాన సర్వీసులను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆ సంస్థ గుర్తు చేసింది.
Also Read: National Commission for Women: చైర్మన్ పదవికి రేఖా శర్మ రాజీనామా
పొరుగునున్న బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోసం విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆ క్రమంలో వందలాది మంది విద్యార్థులు, ప్రజలు మరణించారు. అలాగే వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కర్ప్యూ విధించారు. అయినా పరిస్థితులు మాత్రం అదుపులోకి రాలేదు. మరోవైపు ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థి లోకం గళమెత్తింది. దీంతో ఆమె రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
దాంతో ఆమె రాజీనామా చేసి భరత్‌లో తల దాచుకున్నారు. ఇంకోవైపు బంగ్లాదేశ్‌లో మొత్తం 19 వేల మంది భారతీయులున్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. అయితే వారిలో సగం మంది భారతీయ విద్యార్థులు ఉన్నారన్నారు. వారంత ఇప్పటికే భారత్ చేరుకున్నారని తెలిపారు.
ఆ క్రమంలో బంగ్లాదేశ్‌లోని మరింత మంది భారతీయులను తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశముంది. అదీకాక.. మరికొద్ది రోజుల్లో బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరనుంది. దీంతో పరిస్థితులు సైతం చక్క బడే అవకాశముందని అభిప్రాయం సైతం వ్యక్తమవుతుంది.
Read More National News and Latest Telugu News