Share News

Bangladesh violence: హిందూవులను కాపాడండి.. సద్గురు జగ్గీ వాసుదేవన్ విజ్ఞప్తి

ABN , Publish Date - Aug 07 , 2024 | 11:21 AM

బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవన్ కోరారు.

Bangladesh violence: హిందూవులను కాపాడండి.. సద్గురు జగ్గీ వాసుదేవన్ విజ్ఞప్తి
Spiritual Guru, founder of Isha Foundation, Sadhguru Jaggi Vasudev

చెన్నై, ఆగస్ట్ 07: బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలనిప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు బంగ్లాదేశ్ అంతర్గత విషయం కాదని పేర్కొన్నారు. మన పొరుగునున్న మైనార్టీల భద్రత కోసం సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు.

Also Read: National Commission for Women: చైర్మన్ పదవికి రేఖా శర్మ రాజీనామా


వారికి అండగా నిలవకుంటే భారత్ ఏ నాటికి మహాభారత్ అవదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఈ దేశంలో భాగమైన ప్రాంతం.. పొరుగు ప్రాంతంగా మారిందని గుర్తు చేశారు. ఈ దురాగతాల నుంచి మనజాతికి చెందిన వారిని రక్షించడం మన బాధ్యత అని జగ్గీ వాసుదేవన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లోని 27 జిల్లాలో గల హిందువుల నివాసాలు, వారి వ్యాపార సంస్థలపై దాడులు, లూటీలు చేశారని వార్తలు వస్తున్నాయి.

Also Read: AP Assembly Speaker: స్పీకర్ అయ్యన్న పాత్రుడి నిరాడంబరత


jaggi.jpg

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు సంబంధించి సంస్కరణలు అమలు చేయాలని దేశవ్యాప్త ఆందోళనకు విద్యార్థులు పిలుపునిచ్చారు. దేశ ప్రజలు మద్దతు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ క్రమంలో వందల మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం కర్ప్యూ విధించింది. అయినా.. పరిస్థితులు ఏ మాత్రం అదుపులోకి రాలేదు.

Also Read: Gold Rates: శ్రావణమాసం వేళ.. భారీగా తగ్గిన పసిడి ధరలు..


ప్రభుత్వం దిగి వచ్చి విద్యార్థులను చర్చలకు ఆహ్వానించింది. అవి కూడా విఫలమయ్యాయి. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. దీంతో దేశంలో శాంతి భద్రతలు మరింత క్షీణించాయి. తప్పని సరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా హిందువుల దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరిగాయి. ఆ క్రమంలో అందిన కాడికి దోచుకుంటున్నారు. పొరుగు దేశంలో ఇలాంటి ఘటనలు జరగడంపై సద్గురు జగ్గీవాసుదేవ్‌ స్పందించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 11:36 AM