Home » Bangladesh
బంగ్లాదేశ్లో అల్లర్ల నడుమ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనాపై ఆ దేశంలో హత్య కేసు నమోదయింది. ఆమెతోపాటు మరో ఆరుగురిపై ఈ కేసు నమోదు చేసినట్లు బంగ్లాదేశ్లోని మీడియా మంగళవారం వెల్లడించింది. జులై 19వ తేదీన మొహమ్మద్పూర్లో రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో పోలీసుల కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబూ సయ్యద్ మరణించారు.
పొరుగునున్న బంగ్లాదేశ్లో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భారీగా భారత్.. తన బలగాలను మోహరించింది. అలాంటి వేళ.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో బంగ్లాదేశ్ జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ ఉస్మాన్ కరామట్ అలీ బిశ్వాస్గా అతడిని గుర్తించారు.
బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి.. మొత్తం విస్తీర్ణం మూడు చదరపు కిలోమీటర్లే.. కానీ, ఎంతో వైవిధ్యం.. అంతకుమించిన ప్రకృతి సౌందర్యం.. ప్రత్యేకించి సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం..! దీంతో అమెరికా కన్నుపడింది..
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలను రాహుల్ భారత్లో అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
బంగ్లాదేశ్కు పట్టిన రాక్షసి పీడా వదిలిందని కొన్ని రోజుల క్రితం దేశం వదిలి పారిపోయిన గత ప్రభుత్వాధినేత హసీనాను అభివర్ణిస్తూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనుస్ అన్నారు.
పొరుగున్న బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. దీంతో ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్లో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ - చంబల్ ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ప్రాంతం ఆవాల పంటకు సుప్రసిద్దం. ఇక్కడ సాగవుతున్న ఆవాల నుంచి ఆవపిండిని తీసి.. దాని ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడింది.
బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లు, హింసాకాండలో హిందువులకు తగినంత భద్రత కల్పించలేకపోవడంపై ఆ దేశ హోం మంత్రి షెకావత్ హుస్సేన్ క్షమాపణ చెప్పారు. హిందూ మైనారిటీని రక్షించే బాధ్యత మెజారిటీ ముస్లింలపై ఉందని అన్నారు.
బంగ్లాదేశ్లో పరిస్థితులు సద్దుమణగలేదు. ఆందోళనకారులు తమ ఆయుధాలు వీడలేదు. యువత వద్ద ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. కొన్ని వీడియోలు అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువత వద్ద ఆయుధాలు, రైఫిల్స్ ఉంచుకోవద్దని తేల్చి చెప్పింది. ఒకవేళ మీ వద్ద ఆయుధాలు ఉంటే ఆగస్ట్ 19వ తేదీ లోపు సమీపంలో గల పోలీస్ స్టేషన్లో అప్పగించాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించింది.
బంగ్లాదేశ్లో అధికార మార్పునకు అమెరికా కుట్ర పన్నిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలో తిరుగుబాటు, అల్లర్ల వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం ఉందన్నారు.
బంగ్లాదేశ్లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.