Home » BCCI
కొలంబో వేదికగా ఆదివారం జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెప్తున్నాయి. ఆదివారం నాడు కొలంబోలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కానుందని.. మ్యాచ్ జరిగే రోజు సుమారు 75 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడ్డారు.
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి మరో 4 లక్షల టిక్కెట్లను త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల తొలి విడత అమ్మకాలు పూర్తి కాగా ఇప్పుడు రెండో విడతలో 4 లక్షల టిక్కెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
వన్డే ప్రపంచకప్ కోసం మరికాసేపట్లో భారత జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ ప్రపంచకప్ కోసం జట్లన్నీ తమ ఆటగాళ్ల వివరాలను ఐసీసీకి అందించడానికి సెప్టెంబర్ 5 చివరి తేదీగా ఉంది.
వచ్చే ఐదేళ్ల కాలానికి బీసీసీఐ మీడియా హక్కుల కోసం వేలం నిర్వహించగా డిస్నీ హాట్‌స్టార్, సోనీ సంస్థలతో పాటు వయాకామ్ 18 పోటీ పడింది. ఈ వేలంలో మిగతా కంపెనీలతో పోలిస్తే ఎక్కువ బిడ్ చేసిన వయాకామ్ 18 సంస్థ సుమారు రూ.6వేల కోట్లకు బీసీసీఐ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై సొంతగడ్డపై టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ టీవీలో అయితే స్పోర్ట్ 18, స్పోర్ట్ 18 ఖేల్ ఛానళ్లలో ప్రసారం అవుతాయి. అదే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే జియో సినిమాలో వస్తుంది.
మరో నెల రోజుల్లోనే వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే చాలా జట్లు ప్రపంచకప్ కోసం తమ ఆటగాళ్లను ఎంపిక చేశాయి. అయితే టోర్నీ అతిథ్య జట్టైనా టీమిండియా ఆటగాళ్లను మాత్రం సెలెక్టర్లు ఇప్పటివరకు ఎంపిక చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ పరంగా చాలా అభివృద్ధి చెందిందని భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. క్రీడాకారులకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మంచి సదుపాయాలు, వసతులు కల్పిస్తుందని కొనియాడారు.
బీసీసీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టీమిండియాకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. ఈ నేపథ్యంలో యోయో టెస్ట్ స్కోరును సోషల్ మీడియాలో కోహ్లీ షేర్ చేయడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. ఆసియా కప్‌కు ముందు బెంగళూరులోని శిక్షణ శిబిరంలో టీమిండియా క్రికెటర్లకు టీమ్ మేనేజ్మెంట్ ఫిట్నెస్ టెస్టు నిర్వహించింది. ఈ యోయో టెస్టులో తనకు 17.2 స్కోరు వచ్చిందని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్ 2023 కోసం బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. చాలా కాలం పాటు గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. అంతేకాకుండా తొలిసారి ఇద్దరు తెలుగు కుర్రాళ్లకు కూడా సెలక్టర్లు అవకాశం కల్పించారు.
వన్డే వరల్డ్‌క్‌ప(ODI World Cup)లో భాగంగా హైదరాబాద్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల నిర్వహణకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలపై హెచ్‌సీఏ(HCA) ఆందోళన చెందుతోంది.
భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్లపై బీసీసీఐ, ఐసీసీ కీలక ప్రకటన చేశాయి. ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్లు ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించాయి.