ODI World Cup: వరల్డ్ కప్‌నకు భారత జట్టును ప్రకటించేది ఆ రోజే!
ABN , First Publish Date - 2023-08-29T15:17:07+05:30 IST
మరో నెల రోజుల్లోనే వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే చాలా జట్లు ప్రపంచకప్ కోసం తమ ఆటగాళ్లను ఎంపిక చేశాయి. అయితే టోర్నీ అతిథ్య జట్టైనా టీమిండియా ఆటగాళ్లను మాత్రం సెలెక్టర్లు ఇప్పటివరకు ఎంపిక చేయలేదు.
మరో నెల రోజుల్లోనే వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే చాలా జట్లు ప్రపంచకప్ కోసం తమ ఆటగాళ్లను ఎంపిక చేశాయి. అయితే టోర్నీ అతిథ్య జట్టైనా టీమిండియా ఆటగాళ్లను మాత్రం సెలెక్టర్లు ఇప్పటివరకు ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనబోయే భారత జట్టును సెప్టెంబర్ 3న ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ క్రీడా వెబ్ సైట్ తమ వార్తా కథనంలో పేర్కొంది. అయితే దీనిని బట్టి వన్డే ప్రపంచకప్‌నకు భారత జట్టును ప్రకటించడానికి ముందు మన టీం ఇంకొక మ్యాచ్ మాత్రమే ఆడనుంది. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కావడం గమనార్హం. ఆసియాప్ కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 2న మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే సెలెక్టర్లు ప్రపంచకప్‌నకు టీమిండియాను ఎంపిక చేయనున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం వన్డే ప్రపంచకప్‌నకు జట్లను ప్రకంటించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 5గా ఉంది. అంటే టీమిండియాను 2 రోజుల ముందుగానే ప్రకటించనున్నారు. అవసరమైతే జట్టులో మార్పులు చేసుకోవడానికి సెప్టెంబర్ 27లోగా అవకాశం ఉంది.
కాగా ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్‌నకు 17 మందితో కూడిన భారత జట్టును సెలెక్టర్లు ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియా కప్ స్క్వాడ్ నుంచే వన్డే ప్రపంచకప్‌నకు అవసరమైన 15 మందిని ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తంగా టీమిండియా వన్డే ప్రపంచకప్ జట్టులో ఎవరెవరికీ చోటు దక్కబోతుందనేది ఉత్కంఠగా మారింది.
టీమిండియా ఆసియాకప్ స్క్వాడ్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ