Home » BCCI
వచ్చే ఐదేళ్ల కాలంలో స్వదేశంలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించిన టీవీ, డిజిటల్ హక్కులను విక్రయించడంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఈ విక్రయం ద్వారా బిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ.8,200 కోట్లు ఆర్జించవచ్చని బీసీసీఐ అంచనా వేస్తోంది. అంటే వచ్చే ఐదేళ్లలో బీసీసీఐపై కనక వర్షం కురవనుందనే చెప్పుకోవాలి.
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌నకు మరో 2 నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రపంచకప్‌నకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రపంచకప్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల అమ్మకాలను ఆగస్టు 10 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి జైషా ఇటీవల ఢిల్లీలో ప్రపంచకప్ మ్యాచ్‌లను నిర్వహించే రాష్ట్ర సంఘాలతో భేటీ అయ్యారు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌పై ఉత్కంఠ వీడడం లేదు. వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించిన మ్యాచ్‌లు నిర్వహించే రాష్ట్ర స్థాయి సంఘాలతో నేడు బీసీసీఐ కార్యదర్శి జైషా ఢీల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అక్టోబర్ 15న జరగాల్సిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్లో మార్పు గురించే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. విమానం కోసం ఎయిర్‌పోర్టులో ఏకంగా 4 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో భారత ఆటగాళ్లు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. ఆటగాళ్లకు రాత్రంతా నిద్ర కూడా లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన భారత ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
వచ్చే ఏడాది ఐపీఎల్ వేలం కోసం ఫ్రాంచైజీల పర్స్ పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఐపీఎల్ రేంజ్ మరింత పెరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ అంటే కాసుల వర్షం కురిపించే లీగ్ అని పేరుంది. తాజా సమాచారం ప్రకారం 2024 ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీ పర్సును రూ.100 కోట్లకు పెంచనుంది.
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలను ధరించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యషస్వీ జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ రవీంద్ర జడేజా, ఆజింక్యా రహానె వంటి ఆటగాళ్లు కొత్త జెర్సీలను ధరించి ఫోటోలు దిగారు. అయితే కొత్త జెర్సీలు చెత్తగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు సంధిస్తున్నారు.
టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) శనివారంతో 52వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో అభిమానులు, సన్నిహితులు గంగూలీ పుట్టిన రోజు వేడులకను ఘనంగా నిర్వహిస్తున్నారు. తన 16 ఏళ్ల కెరీర్లో టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్లో చెరగని ముద్ర వేసిన గంగూలీ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. టీమిండియా కష్ట కాలంలో ఉన్న సమయంలో కెప్టెన్సీ చేపట్టి జట్టు గతినే మార్చేశాడు.
దేశీయ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (Syed Mushtaq Ali Trophy) బీసీసీఐ (BCCI) కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి బౌలర్లు ఒక ఓవర్లో రెండు బౌన్సర్లను (Two bouncers) వేయొచ్చని ప్రకటించింది. బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వెల్లడించింది.
వెస్టిండీస్‌తో టీమిండియా ఆడబోయే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. అయితే టాలెంట్ ప్లేయర్ రింకూ సింగ్‌ను సెలక్టర్లు పక్కనపట్టారు. దీంతో బీసీసీఐపై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
బంగ్లాదేశ్‌లో పర్యటించే 17 మంది సభ్యులతో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ సిరీస్ కోసం రెగ్యులర్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఆమె స్థానంలో ఆంధ్రా అమ్మాయి అనూషను ఎంపిక చేశారు.