Home » Bellampalli
బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొన్ని నెలలుగా ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక దొరకక ఎక్కడ చూసినా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణాలు అగుపిస్తున్నాయి. ఇసుక లేక ఇంటి నిర్మాణాలు ఆగిపోవడంతో కూలీలకు ఉపాధి దొరకడం లేదు.
ప్రభుత్వం వెంటనే కాంట్రీ బ్యూటరీ పింఛన్ స్కీంను రద్దు చేసి పాత పింఛ న్ను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీని వాసరావు పేర్కొన్నారు. శనివారం పింఛన్ విద్రోహ దినం సందర్భంగా దేవులవాడ ఉన్నత పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
తాగునీటి సమస్య పరి ష్కరించాలని కౌన్సిలర్లు కలెక్టర్ కుమార్ దీపక్‌కు విన్నవించారు. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం వాడివేడీగా సాగింది. సమావేశానికి కలెక్టర్ కుమా ర్ దీపక్ హాజరయ్యారు.
వసతి గృహాల్లోని విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్ర వారం తాళ్లగురిజాలలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలను సందర్శించారు.
రెండు నెలలుగా ఇసుక సమస్యతో ఉపాధి దొరకడం లేదని, సమస్యను పరిష్కరించాలని శుక్రవారం కాంటా చౌర స్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భవన నిర్మాణ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ రెం డు నెలలుగా మైనింగ్ అధికారులు ఇసుక ఆన్లైన్ ఇవ్వని కారణంగా ఇంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని డీఈవో యాదయ్య పేర్కొన్నారు. గురువారం క్యాతనపల్లి, కల్మలపేట, ముల్కలపేట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. క్యాతనపల్లి పాఠశాల ఉపా ధ్యాయులు సునీల్‌కుమార్ సమయానికి హాజరు కాకపోవ డంతో డీఈవో సస్పెండ్ చేశారు.
పత్తి పంట రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆరుతడి పంటైన పత్తికి అడపదడప కురుస్తున్న వర్షాలతో కాలం కలిసివస్తోంది. అదనులో విత్తనాలు పడటంతో పత్తి పంట 70 నుంచి 90 రోజుల వయ సులో ఉంది. ఎలాంటి చీడపీడల బెడద లేకుండా ఏపుగా పెరుగుతూ గూడ కట్టి పూతకు వస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి సంస్థను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
మాడు పగిలే ఎండ.. ఉక్కిరిబిక్కిరి చేసిన వాన! రెండూ ఒకేరోజు విరుచుకుపడటంతో ఆ కష్టనష్టాలు అన్నీఇన్నీకావు! ఎండదెబ్బకు ఇబ్బందిపడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకూ వణికిపోయారు! వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి.. విద్యుత్తుస్తంభాలను పడగొట్టి.. ఇళ్లపై రేకులను గల్లంతు చేసి.. క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది.