Home » Bhadradri Kothagudem
భద్రాద్రి జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పురిగొల్పినవారిని ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభాకర్ ఆత్మహత్య బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి భద్రాచలం (Bhadrachalam)లో కలపాలని స్థానిక నేతలు, ప్రజలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)ను కోరారు. ఈ మేరకు భద్రాచలం విలీన గ్రామాల నేతలు హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Telangana: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు తమముందు ఎంతో ఆనందంగా ఉన్న వారు హఠాత్తుగా మరణిస్తుంటారు. అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్న ఓ చిన్నారి.. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎ్‌స)లో శనివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదానికి పిడుగుపాటే కారణమని అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్-3 (320, 420/16.5 కేవీ) పూర్తిగా కాలిపోయింది.
భద్రాద్రి పవర్ ప్లాంట్ ఒకటో యూనిట్‌పై పిడుగు పడింది. పిడుగు పాటుకు 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది. జనరేషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగినట్లు ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.
కంచుమేళం (డోలి) కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) ఆదివారం ఉదయం ఆనారోగ్యంతో మృతిచెందారు. అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసిన ఆయన 2022 జనవరి 25న రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ భరించలేనంత స్థాయికి భద్రాద్రి పవర్ ప్లాంట్ భారం చేరిందని, ఛత్తీ్‌సగఢ్‌తో చేసుకున్న విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్, తిమ్మారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌పై విచారణ చేస్తున్న కమిషన్‌కు వారు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.
విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ప్లాంట్లపై వివరణ ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్ పంపిన లేఖ తమకు అందిందని విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు.
నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రాన్ని తొలకరి పలకరించింది. పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. సాయంత్రం వేళ గంటన్నర పాటు కుండపోత వానతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులను వరద ముంచెత్తింది. బేగంబజార్‌లో అత్యధికంగా 8.8, బండ్లగూడలో 8.1, సర్దార్ మహల్లో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం పడింది.
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, పెనుబల్లి, జూన్ 3: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24ననిర్వహించిన పాలిసెట్ ఫలితాలను సోమవారం విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇందులో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.